ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10నెలలుగా Electricity Officeలో రైతు చేసిన పనికి ఉన్నతాధికారులు షాక్.. కిందిస్థాయి అధికారులకు నోటీసులైతే ఇచ్చారు కానీ..

ABN, First Publish Date - 2022-06-05T00:26:07+05:30

ఆయన ఒక రైతు. సుమారు 10 నెలలుగా దగ్గర్లోని ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కు వెళ్లి తన అవసరాలను తీర్చుకుంటూ ఉన్నాడు. అయితే అతడు చేసే పనిని కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా ఉ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒక రైతు. సుమారు 10 నెలలుగా దగ్గర్లోని ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కు వెళ్లి తన అవసరాలను తీర్చుకుంటూ ఉన్నాడు. అయితే అతడు చేసే పనిని కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. కింది స్థాయి అధికారలకు  నోటీసులు జారీ చేశారు కానీ ఆ రైతు సమస్యను మాత్రం ఇంకా తీర్చలేదు. కాగా.. ఇంతకూ ఆ రైతు ఎవరు.. అతడి సమస్య ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


హనుమంతప్పా అనే రైతు.. కర్నాటకలోని శివమొగ్గ జిల్లా, మాంగోట్(Mangote) అనే గ్రామంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అయితే.. అతడి ఇంటికి చాలా రోజులుగా రోజులో 3-4 గంటలు మాత్రమే కరెంట్ సప్లై అవుతుంది. గ్రామంలోని ఇతరులకు మాత్రం ఈ సమస్య లేదు. దీంతో తన ఇబ్బందిని పలు మార్లు హనుమంతప్ప అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మిక్సీలు, సెల్‌ఫోన్ ఛార్జింగ్ కోసం పదే పదే ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆయన సమస్యను అధికారులు చులకనగా చూశారు. 



ఈ క్రమంలోనే ‘స్థానికంగా ఉన్న Electricity Office‌కు వెళ్లి, అక్కడ మిక్సీలు వాడుకోవాలని, సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో అధికారుల మాటలను హనుమంతప్ప.. యథావిథిగా పాటించాడు. గత 10 నెలలుగా స్థానిక ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌లోనే తన అవసరాలను తీర్చుకుంటున్నాడు. అధికారులు కూడా దానికి అభ్యంతరం చెప్పలేదు. అయితే తాజాగా కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో.. ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. Electricity Office‌లో పని చేసే కింది స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేశారు. కానీ హనుమంతప్ప సమస్యను తీర్చేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.


Updated Date - 2022-06-05T00:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising