ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Trolls on Singer Sid Sriram: లోపం అక్కడ ఉంటే.. సంబంధంలేని సిధ్ శ్రీరామ్ ని ఆడిపోసుకోవడం ఏంటి..?

ABN, First Publish Date - 2022-08-27T01:59:15+05:30

కర్ణాటక సంగీతంలో ఆలాపన ఆరోహణ అవరోహణ గమకాలు స్వరజతులతో తొడమీద తాళాన్ని చరుస్తూ పాడినట్లు అన్ని సినిమా పాటలను సిధ్ శ్రీరామ్ ఒకేలా పాడుతున్నా..." ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నది ఆ యూట్యూబ్ వీడియో కర్త మరో విసురు.

'సిధ్ శ్రీరామ్ సమర్పిత ఇనుప గుగ్గిళ్లు ' పేరుతో ధాత్రి మహతి యూట్యూబ్ ఛానల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అయితే,  ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు సిధ్ శ్రీరామ్ ( Sid Sriram) పాడే పాటలో ఉచ్ఛారణ దోషాలను ఎత్తిచూపుతూ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ పమిడికాల్వ మధుసూదన్ చేసిన వ్యాఖ్యానం పరమ డొల్లగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  దారితప్పిన ఆ విమర్శ చవకబారుగా ఉందంటున్నారు సిధ్ అభిమానులు ( Sid Sriram Fans). 


'బాలసుబ్రహ్మణ్యం దక్షిణాది పాటల రాజ్యాన్ని ఏలాడు..' అని చెప్పిన నోటితోనే 'తెలుగు పాటలను తెలుగువారిచేత పాడించకపోవడం..' అని విమర్శించింది ఆ వీడియో. దీనిమీద స్పందిస్తున్న నెటిజన్లు-  ఎవరైనా వారి మాతృభాషలోనే పాడాలనే తీర్మానాలు చేస్తే ఏ సంగీతానికైనా, ముఖ్యంగా పాపులర్ సినీ సంగీతానికి ఉనికే ఉండేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. లీల, వాణీజయరాం, జేసుదాసు వంటి ఎందరో పరభాషా గాయకులు తెలుగు సినిమా పాటలు పాడారు, పాడుతూనే ఉన్నారు. మన తెలుగు గాయనీగాయకులు ఇతర భాషల్లో పాడారు, పాడుతున్నారు కూడా. 


పొరయాత్తు లీల (పీ.లీల) అనే మళయాళీ ప్లేబాక్ సింగర్,  మద్రాస్ లలితాంగి వసంతకుమారి (ఎం.ఎల్. వసంతకుమారి) అనే తమిళ గాయనీమణీ పాడిన తెలుగు పాటల్లో ఉచ్ఛారణాదోషాలు ఉండకపోవడానికి, సిధ్ శ్రీరాం, హరిహరన్, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్, కుమార్ సానూ... వంటి పరభాషా గాయకుల పాటల్లో దోషాలు ఉండటానికీ గీతరచయితల (lyricists) బాధ్యత లేదు, ఉండదు. ఏ సాంకేతిక శాఖ అయితే అప్పటి తరం పరాయి భాషల గాయకులకి పాటల అర్థాన్ని వివరించి, లిపిని సవరించి, ఉచ్ఛారణ సంగతులు బోధించి, పాటకి ఆత్మని అందించారో, అటువంటి  శ్రద్ధ పెట్టే సిబ్బంది, అంత అవగాహన ఉన్న దర్శకులు ఇప్పుడు లేకుండా పోయారేమో. లోపం అక్కడ ఉంటే, సంబంధంలేని సిధ్ శ్రీరామ్ ని ఆడిపోసుకోవడం ఏంటని సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తున్నారు సిధ్ అభిమానులు. 


అదలా ఉంటే- 

"కర్ణాటక సంగీతంలో ఆలాపన ఆరోహణ అవరోహణ గమకాలు స్వరజతులతో తొడమీద తాళాన్ని చరుస్తూ పాడినట్లు అన్ని సినిమా పాటలను సిధ్ శ్రీరామ్ ( Sid Sriram controversy ) ఒకేలా పాడుతున్నా..." ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నది ఆ యూట్యూబ్ వీడియో కర్త మరో విసురు. సిధ్ శ్రీరామ్ పాటలో వైవిధ్యం లేదనీ monotonous ఉంటోందనీ చెప్పడానికి సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పోల్చడమేమిటో అంతుబట్టలేదంటున్నారు నెటిజన్లు. కర్ణాటక సంగీతంలో కూడా అన్ని కీర్తనలూ ఒకేలా పాడతారా, గొప్ప సంప్రదాయ కర్ణాటక సంగీతం మీద ఏమిటి అంత అవగాహనారాహిత్యం అంటూ మండిపడుతున్నారు.  "రామపాదం సోకి అహల్యకు మోక్షం సిద్ధించింది. సిధ్ శ్రీరామ్ గానం సోకి మనకు ఇనుప గుగ్గిళ్లు సిద్ధిస్తున్నాయి...." అని అర్థంపర్థంలేని అన్వయాలతో మోకాలికి.. బోడిగుండుకు.. ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని సదరు ఎడిటర్ ని ఎద్దేవా చేస్తున్నారు.


‘ఉంటే... కంటే... మంటి... పంటి... ఒంటి…’ వంటి పదాలను సిధ్ శ్రీరామ్ – ‘ఉల్టే... కల్టే... మల్టి... పల్టి... ఒల్టి…’ ‘అంటూ పలుకుతున్నాడని ఆ వీడియో సోదాహరణంగా వెక్కిరించింది. తమిళ.. మళయాళీ వర్ణమాల (Alphabet) తెలుగులా విస్తృతమైనవి కావు. క-ఖ-గ-ఘ - 4 అక్షరాలకూ కలిపి ఒకటే అక్షరం. అందుకే, జేసుదాసు వంటి మహా మహా గాయకులు కూడా 'మహా' బదులు 'మగా' అంటారు; 'భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా...' లో 'భా'కి గూటం ఎగరగొట్టేస్తారు. అక్షరాలు- మారిపోవడం, మాయమవ్వడం, ఒత్తులు పొల్లులు ఎగిరిపోవడం, దీర్ఘాలు హఠాత్తుగా హ్రస్వాలు కావడం సిధ్ శ్రీరామ్ తో ( Sid Sriram Songs ) మొదలయ్యిందా?  అలా తప్పులు పాడకుండా చూసుకోవల్సిన బాధ్యత పరభాషీయులైన ఆ గాయకులది కాదు. అలాగని ఆ పాటలు రాసిన గీతరచయితలది కూడా కాదు. 


"చంద్రబోస్, రామజోగయ్య, అనంత్ శ్రీరామ్ తో పాటు ఏ రచయిత అయినా, సిధ్ శ్రీరామ్ కు… ఉంటే... కుందాం... అన్న మాటలను ఇంగ్లీషులో Unte(not ulte) Kundam(not kuldam) అని రాసి చూపించి... వాటిని ఎలా పలకాలో కూడా చెప్పాల్సిందిగా భాషాభిమానులుగా మా అభ్యర్థన," అంటున్నారు ‘ధాత్రి మహతి’ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్. 'నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు/ ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయ లేదా అసలు...' అని పాటల రచయిత  రాస్తే, 'కాళ్ళు- కళ్ళు- కల్లు' – మూడింటినీ కలగలిపేసి సిధ్ శ్రీరామ్ ( Trolls on Sid Sriram ) పాడుతున్నాడని తెలుగు భాషాభిమానులు గగ్గోలు పెట్టడంలో అర్థంలేదు. 


Updated Date - 2022-08-27T01:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising