ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fake IT Raids: వ్యాపారి ఇంట్లో నకిలీ ఐటీ దాడులు.. భారీ సొమ్ము లూటీ.. ఈ స్కెచ్ వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-08-27T00:49:52+05:30

ముంబై (Mumbai)కి చెందిన ఓ వ్యాపారి ఇంట్లో సినీ ఫక్కీలో లూటీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (Mumbai)కి చెందిన ఓ వ్యాపారి ఇంట్లో సినీ ఫక్కీలో లూటీ జరిగింది. ఇన్‌కమ్ ట్యాక్స్ (Fake Income Tax Raids)అధికారులమంటూ కొందరు వ్యక్తులు ఆ వ్యాపారి ఇంటికి వెళ్లి లక్షల రూపాయలు దోచుకున్నారు. వారు ఆ ఇంటికి వెళ్లిన సమయంలో వ్యాపారవేత్త, అతని భార్య లేరు. వ్యాపారవేత్త తల్లి మాత్రమే ఉన్నారు. ఆమెను భయపెట్టి వారు చోరీ చేశారు. ఈ మొత్తం ఘటన వెనుక ఆ వ్యాపారి ఇంట్లో పనిచేసే మహిళ హస్తం ఉందని బయటపడడంతో అందరూ షాకయ్యారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకే దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డారు. 


ఇది కూడా చదవండి..

Madhya Pradesh: భార్యపై ఎంత ప్రేమో.. ఆమె చనిపోయాక భర్త చేసిన పనికి అందరూ షాక్.. చివరకు..


ముంబైలోని విక్రోలిలో నివాసం ఉంటున్న ఓ బిజినెస్ మ్యాన్ ఇంట్లో దోపిడీకి కొందరు దొంగలు మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ బిజినెస్ మ్యాన్, అతని భార్య ఇంట్లో లేని సమయంలో దొంగలు లోపలికి ప్రవేశించారు. తాము ఐటీ అధికారులమని చెప్పి వ్యాపారవేత్త తల్లికి ఫేక్ ఐడీ కార్డులు చూపించారు. నకిలీ సెర్చ్ వారెంట్ కూడా చూపించారు. అనంతరం నేరుగా లాకర్ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వ్యాపారవేత్త ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయానికి ఫోన్ చేసి అడగ్గా.. అలాంటి రైడ్స్ తాము చేయలేదని చెప్పారు. 


సదరు వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భవనంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలు వచ్చిన కారు నెంబరును పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా దాని యజమానిని గుర్తించి దొంగలను  పట్టుకున్నారు. ఈ మొత్తం ఘటన వెనుక ఆ వ్యాపారి ఇంట్లో పనిచేసే మహిళ హస్తం ఉందని (Maid Behind The Fake IT Raids)తేలింది. ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఇంట్లో ఎవరెవరు ఎప్పుడు ఉంటారు అనే సమాచారాన్ని ఆ మహిళే దొంగలకు  తెలియజేసిందని విచారణలో తేలింది. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మందిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-08-27T00:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising