ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం పేరుతో 200 మందిని దోచుకున్న మోసగాళ్లు.. ఇదంతా ఎలా చేశారంటే..

ABN, First Publish Date - 2022-02-06T05:30:00+05:30

జీవినం సాగించడానికి ఉద్యోగం వెతికేవాళ్లను టార్గెట్ చేసి ఒక హైటెక్ ముఠా లక్షలు దోచుకుంది. ఇకరిద్దరు కాదు.. ఏకంగా 200 మందికి పైగా ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పోలీసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవినం సాగించడానికి ఉద్యోగం వెతికేవాళ్లను టార్గెట్ చేసి ఒక హైటెక్ ముఠా లక్షలు దోచుకుంది. ఇకరిద్దరు కాదు.. ఏకంగా 200 మందికి పైగా ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. మొత్తం ముగ్గురు మాస్టర్ మైండ్స్‌ పురుషులతో సహా 9 మంది ఆడవాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.


వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు నీరజ్, ఆమిర్, సోను కలిసి ఒక కాల్ సెంటర్ నడుపుతున్నారు. ఇందులో మొత్తం 9 మంది యువతులు పనిచేస్తున్నారు. వీరంతా ఉద్యోగం కోసం వెతికే వారి గురించి సమాచారం సేకరించి వారికి ఫోన్లు చేస్తారు. ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఆశ చూపి.. ఆఫీసుకి రమ్మంటారు. ఆ తరువాత ఆఫీసులో ప్రొఫైల్ తయారు చేయాలి. రిజిస్ట్రేషన్ చేయాలి. శిక్షణ తీసుకోండి అని ఒక్కో వ్యక్తి వద్ద రూ.50,000 నుంచి రూ.3 లక్షల దాకా లాగుతారు.


కానీ డబ్బులు తీసుకున్నాక క్రమంగా అదిగో.. ఇదిగో కాలం వెళ్లదీసి.. ఆ తరువాత ఫోన్లు కట్ చేస్తారు. చివరికి బాధితులకు ఉద్యోగ పరీక్షలో ఫెయిలయ్యారని చెబుతారు. బాధితులు తాము మోసపోయామని గ్రహించినా.. ఏమి చేయలేని పరిస్థితి సృష్టిస్తారు. ఇలా కాలం వెళ్ల దీస్తున్న ఈ కేటుగాళ్ల గురించి ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


పోలీసులు ఒక వ్యక్తిని నిరుద్యోగి రూపంలో ఆ నకిలీ కాల్ సెంటర్ వద్ద పంపి వారి గురించి మొత్తం కూపీ లాగారు. ఆ తరువాత కాల్ సెంటర్‌‌లో తనిఖీ చేసి మొబైల్స్, లాప్‌టాప్స్, రూ.2.5 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్న 9 మంది యువతులతో సహా.. 3 పురుషులను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ మోసగాళ్లు 200 మందిపైగా నిరుద్యోగులను ఎయిర్ లైన్స్ పేరుతో దోచుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.


Updated Date - 2022-02-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising