ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికలకు ఫేస్ బుక్‌ ద్వారా పరిచయమైన యువకుడు.. ప్రేమ పేరుతో వారిని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాడంటే..

ABN, First Publish Date - 2022-02-17T05:38:04+05:30

సోషల్ మీడియా ద్వారా యువతీయువకులు ఒకరినొకరు పరిచయం చేసుకొని స్నేహితులు మారడం సహజం. కానీ కొన్ని సందర్భాల్లో అలా తెలియని వారితో స్నేహం చేయడం ప్రమాదకరంగా మారుతుంది. తాజాగా ఇలాంటి ఒక ఘటనలో ఇద్దరు బాలిరలకు ఒక యువకుడు పరిచయమయ్యాడు. అతను వారిని ఎప్పుడూ సరదాగా నవ్వించేవాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా ద్వారా యువతీయువకులు ఒకరినొకరు పరిచయం చేసుకొని స్నేహితులుగా మారడం సహజం. కానీ కొన్ని సందర్భాల్లో అలా తెలియని వారితో స్నేహం చేయడం ప్రమాదకరంగా మారుతుంది. తాజాగా ఇలాంటి ఒక ఘటనలో ఇద్దరు బాలిరలకు ఒక యువకుడు పరిచయమయ్యాడు. అతను వారిని ఎప్పుడూ సరదాగా నవ్వించేవాడు. దీంతో ఆ బాలికలు అతడితో ఒకసారి కలవాలనుకున్నారు. అలా ఒకరోజు ఆ యువకుడు ఆ ఇద్దరు బాలికలను కలిసి ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్లానని చెప్పి కిడ్నాప్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ప్రియాంక(17, పేరు మార్చబడినది), ప్రతిమ(16, పేరు మార్చబడినది) అనే ఇద్దరు బాలికలు సోషల్ మీడియా ద్వారా వికాస్ సోనీ(23) అనే యువకుడికి పరిచయమయ్యారు. వికాస్ సోనీ వారితో రోజూ సరదాగా మాట్లాడేవాడు.. నవ్వించేవాడు. దీంతో ప్రియాంక, ప్రతిమ ఒకరోజు వికాస్‌ని కలవాలనుకున్నారు. కానీ వికాస్ వారిద్దరినీ ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్తానని చెప్పాడు. అక్కడ ఒకరోజంతా గడుపుదామని ప్లానింగ్ చేశాడు. 


ప్లాన్ ప్రకారం ప్రియాంక, ప్రతిమ ఒకరోజు వికాస్‌ని నగరంలోని బస్టాండ్ వద్ద కలిశారు. అక్కడికి వికాస్‌తో పాటు అతని కజిన్ అమన్ సోనీ కూడా వచ్చాడు. వారంతా కలిసి ట్రైన్‌లో మధ్య ప్రదేశ్‌లోని ఇందోర్‌ నగరానికి వెళ్లారు. అక్కడ వికాస్ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని బాలికలను అందులో బంధించారు. ఆ ఇంట్లో వికాస్, అమన్ కలిసి ఇద్దరు బాలికలపై మూడు నెలల వరకూ అత్యాచారం చేశారు. 


మరోవైపు 2021 అక్టోబర్ 20న పోలీసులకు ప్రియాంక, ప్రతిమలు కనబడడం లేదని వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు నెలల తరువాత ఇద్దరు బాలికల ఆచూకీ తెలుసుకున్నారు. ఆ తరువాత బాలికల వాంగ్మూలం ప్రకారం వికాస్ సోనీ, అమన్ సోనీలపై కిడ్నాపింగ్, అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలించి పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితులిద్దరూ రిమాండ్‌లో ఉన్నారు.

Updated Date - 2022-02-17T05:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising