ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుడి కోసం మండపంలో వధువు ఎదురుచూపు.. ఆర్భాటంగా రావాల్సిన పెళ్లికొడుకు అంబులెన్స్‌లో ఎంట్రీ.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-03-05T03:18:58+05:30

రాజస్థాన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వివాహ కార్యక్రమంలో వరుడి రాక కోసం అతిథులతో పాటూ వధువు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మండపంలోకి ఆర్భాటంగా అడుగుపెట్టాల్సిన వరుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహ కార్యక్రమంలో ఎవరు లేకున్నా.. వధూవరులు ఉంటే చాలు. అయితే కొన్ని సార్లు ఇలాంటి శుభకార్యాల్లో అశుభాలు కూడా జరుగుతుంటాయి. మండపంపైకి వెళ్లే వరకూ పెళ్లి జరుగుతుందా, లేదా అన్న సందేహం నెలకొనే పరిస్థితులు కూడా తలెత్తుతుంటాయి. కొన్నిసార్లు ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న సమయానికి కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. రాజస్థాన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వివాహ కార్యక్రమంలో వరుడి రాక కోసం అతిథులతో పాటూ వధువు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మండపంలోకి ఆర్భాటంగా అడుగుపెట్టాల్సిన వరుడు.. అంబులెన్స్‌లో రావడంతో అంతా షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే..


రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ పరిధి కోతిబాగ్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న రాహుల్ కటారియా అనే వ్యక్తికి వివాహం నిశ్చయమైంది. శివరాత్రి సందర్భంగా స్థానికంగా ఉన్న  సింధీ సొసైటీ నిర్వాహకులు సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు. మిగతా నూతన జంటలతో పాటూ రాహుల్ కటారియా జంట పేర్లను కూడా నమోదు చేశారు. అయితే వివాహానికి సరిగ్గా ఐదు రోజులు గడువు ఉందనగా దురదృష్టవశాత్తు రాహుల్‌కు కాలు విరిగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసిన వైద్యులు.. ఆపరేషన్ చేసి విరిగిన కాలులో రాడ్డును అమర్చారు. దీంతో అతను నడవలేని పరిస్థితి ఏర్పడింది. వివాహ సమయం దగ్గర పడుతుండడంతో ఇటు రాహుల్ కుటుం సభ్యులతో పాటూ అటు వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాహుల్ మాత్రం కార్యక్రమం ఆగొద్దని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

‘‘నీకో బహుమతి ఇస్తా, ఊరిబయటకు వచ్చెయ్’’.. అంటూ ప్రియురాలిని పిలిచిన యువకుడు.. మాట్లాడుతూ మాట్లాడుతూ..


కార్యక్రమం ఆపొద్దని సొసైటీ నిర్వాహకులకు తెలియజేశాడు. దీంతో వివాహ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బంధువులంతా వేడుక వద్దకు చేరుకున్నారు. తాళి కట్టే ఘట్టం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో మండపం వద్దకు వరుడు అంబులెన్స్‌లో రావడం చూసి అంతా షాక్ అయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న రాహుల్‌ను కొందరు ఎత్తుకుని రావడాన్ని చూసి ఏం జరిగిందో తెలీక అంతా గుసగుసలాడుకున్నారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని అంతా రాహుల్‌ను అభినందించారు. ప్రస్తుతం కార్యక్రమం ఆగొద్దని సొసైటీ నిర్వాహకుల సహకారంతో ఆస్పత్రి నుంచి వచ్చానని వరుడు తెలిపాడు. కోలుకున్న తర్వాత త్వరలో మళ్లీ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని వధూవరుల కుటుంబ సభ్యులు తెలిపారు.

మీ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని పక్కింటోళ్లు అంటున్నా లేదని బుకాయించిందా భార్య.. పోలీసుల ఎంట్రీతో..

Updated Date - 2022-03-05T03:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising