ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నదిలో స్నానం.. ఆపై దేవుడి దర్శనం

ABN, First Publish Date - 2022-07-16T17:48:05+05:30

ప్రసిద్ది గాంచిన పర్యాటక స్థలమైన హంపిలో విరుపాక్షేశ్వరాలయం ఆస్థాన గజరాజు (లక్ష్మీ) శుక్రవారం పర్యాటకులను అబ్బురపరిచింది. ఆ ఏనుగు ఆలయం పక్కన ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - హంపిలో అబ్బురపరచిన గజరాజు


కంప్లి(బెంగళూరు): ప్రసిద్ది గాంచిన పర్యాటక స్థలమైన హంపిలో విరుపాక్షేశ్వరాలయం ఆస్థాన గజరాజు (లక్ష్మీ) శుక్రవారం పర్యాటకులను అబ్బురపరిచింది. ఆ ఏనుగు ఆలయం పక్కన ఉన్న తుంగభద్ర నదిలో స్నానం ఆచరించింది. తొండంతో నీటిని తీసుకుని ఒంటిపై కుమ్మరించుకుంటూ జలకాలాడింది. అక్కడికి వచ్చిన పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం తుంగభద్ర నదిలో భారీగా పోటెత్తుతున్న నీటిని లెక్కచేయకుండా నదిలోకి దిగి సాఫీగా  స్నానం చేస్తుండటంతో కొందరు పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. గజరాజు స్నానం చేసిన వెంటనే విరుపాక్షేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి మోకాళ్లపై కూర్చుని స్వామివారిని దర్శనం చేసుకుంది. గజరాజు నిష్టతో పూజలు చేయడం చూసి పర్యాటకులు అశ్చర్యం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-16T17:48:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising