ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: నీటిలో పడిపోయిన జింకను రక్షించేందుకు ఆ ఏనుగు ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-05-17T23:01:50+05:30

అది తను కని, పెంచిన జీవి కాదు.. అసలు తన జాతే కాదు.. అయినా ఒక జంతువు ప్రాణాపాయ స్థితిలో పడడం చూసి ఆ ఏనుగు హృదయం తల్లడిల్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది తను కని, పెంచిన జీవి కాదు.. అసలు తన జాతే కాదు.. అయినా ఒక జంతువు ప్రాణాపాయ స్థితిలో పడడం చూసి ఆ ఏనుగు హృదయం తల్లడిల్లింది.. జూ సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేసి ఆ జీవిని కాపాడిన తర్వాతే ఆ ఏనుగు మనసు శాంతించింది.. ఎంతో మంది నెటిజన్ల హృ‌దయాలను తాకిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గ్వాటెమాల సిటీలోని `లా అరోరా` జూలో ఈ ఘటన జరిగింది. 



 గ్వాటెమాల సిటీలోని `లా అరోరా`జూలో ఉన్న చిన్న చెరవులో ఓ జింక పడిపోవడాన్ని అదే జూలో ఉండే ట్రోంపిటా అనే ఏనుగు చూసింది. ఆ చెరవులోంచి బయటకు వచ్చే అవకాశం లేక, మునిగిపోతున్న ఆ జింకను రక్షించేందుకు ఏనుగు తీవ్రంగా ప్రయత్నించింది. గట్టిగా ఘీంకరించి జూ సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఏనుగు కేకలు విన్న జూ సిబ్బంది ఒకరు పరుగున వచ్చి చెరువులో ఉన్న జింకను రక్షించారు. ఈ దృశ్యాన్ని జూకు వెళ్లిన మరియా డియాజ్ అనే యువతి తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించింది. అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అయింది.



Updated Date - 2022-05-17T23:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising