ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బామ్మ డ్రైవింగ్‌కు నెటిజన్లు ఫిదా.. మీరూ ఓసారి చూసేయండి!

ABN, First Publish Date - 2022-09-17T16:27:12+05:30

భర్తలు ముందు నడుస్తుంటే.. వారి అడుగుల్లో భార్యలు అడుగులు వేస్తూ నడిచే కాలం పోయింది. భర్తలతో పోటీ పడి మరీ సతీమణులు ప్రయాణం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ముందుండి భర్తలను నడిపిస్తున్నారు కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఇంటర్నెట్ డెస్క్: భర్తలు ముందు నడుస్తుంటే.. వారి అడుగుల్లో భార్యలు అడుగులు వేస్తూ నడిచే కాలం పోయింది. భర్తలతో పోటీ పడి మరీ సతీమణులు ప్రయాణం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ముందుండి భర్తలను నడిపిస్తున్నారు కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. వృద్ధ దంపతులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోను నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ విషయం ఏంటంటే..


ఆడ, మగ తేడా లేకుండా ఇప్పటి తరం యువత(Youth).. వాహనాలను ఈజీగా రోడ్డుపై తోలేస్తూ రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో.. పాత తరానికి చెందిన ఓ మహిళ తన భర్తను వనకాల కూర్చోబెట్టుకుని ద్విచక్ర వాహనాన్ని నడిపింది. సుమారు 60ఏళ్ల వయసు ఉన్న బామ్మ(Elderly Woman).. తెలుపు రంగు దుస్తులు ధరించిన తన భర్తను వెనకాల కూర్చొబెట్టుకుని చీర కట్టులో బండి నడిపింది(Bike Ride). ప్రస్తుతం యువతీ, యువకులకు ఏ మాత్రం తీసి పోకుండా.. చాలా కాన్ఫిడెన్స్‌‌తో రోడ్డు మీద బండిపై దూసుకుపోయింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోకాస్తా ప్రస్తుతం వైరల్‌(Viral)గా మారింది. 


బామ్మ బండి నడుపుతున్న వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ఈ వయసులో బండి నడపడం మామూలు విషయం కాదు. చాలా గ్రేట్. చూడటానికి ఎంతో అందంగా ఉంది. నీ డ్రైవింగ్‌కు అసలు తిరుగు లేదు’ అంటూ కామెంట్ చేశారు. అయితే.. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందనే విషయంపై స్పష్టత లేదు. 


Updated Date - 2022-09-17T16:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising