ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో పెళ్లి విషయంలో గొడవపడ్డ భార్యాభర్తలు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు.. ఇద్దరికీ దేశ బహిష్కరణ విధించిన కోర్టు

ABN, First Publish Date - 2022-01-19T10:09:43+05:30

భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకొని కోర్టుకెక్కారు. ఇద్దరి గాయాలు చూసిన కోర్టు ఆరు నెలలు జైలు శిక్షతోపాటు దేశ బహిష్కరణ శిక్ష విధించింది. ఈ ఘటన దుబాయ్ దేశంలో జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకొని కోర్టుకెక్కారు. ఇద్దరి గాయాలు చూసిన కోర్టు ఆరు నెలలు జైలు శిక్షతోపాటు దేశ బహిష్కరణ శిక్ష విధించింది. ఈ ఘటన దుబాయ్ దేశంలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌లో ఉద్యోగ రీత్యా స్థిరపడిన ఆసియా దంపతుల మధ్య అవగాహన లేమి సమస్య ఏర్పడింది. దీంతో ఆ భర్త(24) ఇక తన భార్య(25)తో కలిసి ఉండకూడదని నిర్ణయించుకొని రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయాన్ని ముందుగా భార్యకు చెప్పాడు. భర్త మాటలు విన్న ఆ భార్య కోపం పట్టలేక భర్తపై దాడి చేసింది. 


భార్య చేసే దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువకుడు అకస్మాత్తుగా కింద పడిపోయాడు.  ఆ సమయంలో అతని చేతుల రెండు వేళ్ల ఎముకలు విరిగిపోయాయి. కానీ ఆ భార్య ఇంతటితో ఆగలేదు.. ఇంకా కొట్టడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలో యువకుడు కూడా తన భార్యపై ఎదురుదాడి చేశాడు. దీంతో ఆ మహిళ తల, ముక్కు,చెవి, మెడ భాగాలపై దెబ్బలు తగిలాయి.  ఆమెకు కూడా వినికిడి సమస్య ఏర్పడింది.


ఈ ఆలుమగలు తమ జీవిత భాగస్వామిని ఒకరినొకరు గాయపరిచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తద్వారా కోర్టుకెక్కారు. ఇద్దరి వాదనలు విన్న కోర్టు భార్యభర్తలిద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష అనంతరం దేశ బహిష్కరణ విధించింది.

Updated Date - 2022-01-19T10:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising