ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: అంగరంగ వైభవంగా శునకాల వివాహం.. 400 మంది హాజరు.. ఈ పెళ్లిపై పురోహితుడు ఏమన్నాడంటే!

ABN, First Publish Date - 2022-07-03T16:35:37+05:30

శునకాల వివాహానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ పెళ్లి వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివెళ్లారు. దాదాపు 400 మంది ప్రజలు ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: శునకాల వివాహానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ పెళ్లి వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివెళ్లారు. దాదాపు 400 మంది ప్రజలు ఆ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ‘ఏంటీ.. శునకాలకు పెళ్లి చేయడమే ఒక షాకింగ్ న్యూస్ అనుకుంటే.. ఆ వివాహనికి 400 మంది హాజరయ్యారా’ అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. నమ్మశక్యం కానప్పటికీ ఇది నిజం. ఇంతకూ ఈ వివాహం ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని మోతీహరి ప్రాంతానికి చెందిన నరేష్ సాహ్నీ దంపతులు.. వారి ఇంట్లో రెండు శునకాలను పెంచుకుంటున్నారు. కళ్లు, బసంతి అని పిలుచుకుంటూ.. కుటుంబ సభ్యులుగా వాటిని చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు శునకాలకు సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిపించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే.. అందుకోసం ఏర్పాట్లు చేశారు. పురోహితుడి ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుకకు దాదాపు 400 మంది అతిథులు హాజరయ్యారు. అంతేకాకుండా వాటికి కానుకలను కూడా సమర్పించి.. వివాహ భోజనాన్ని ఆరగించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన డీజే పాటలకు స్టెప్పులేసి మరీ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 



ఈ సందర్భంగా వివాహాన్ని జరిపించిన పురోహితుడు మాట్లాడుతూ.. శునకాలను కాలభైరవుడి స్వరూపాలుగా భావించిన పెళ్లి జరిపించినట్టు పేర్కొన్నారు. ఈ వివాహం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నరేష్ సాహ్నీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఈ రెండు శునకాల తమ వద్దే కలిసి పెరిగాయని చెప్పారు. కలిసి పెరిగిన వాటిని పెళ్లి బంధంతో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వివాహం జరిపించినట్టు వివరించారు. 


Updated Date - 2022-07-03T16:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising