ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: షాపులోని చిప్స్ ప్యాకెట్ దొంగిలించేందుకు శునకం, కోతి పక్కాగా స్కెచ్ వేశాయిగా!

ABN, First Publish Date - 2022-05-22T19:33:32+05:30

అవి రెండూ వేరు వేరు జాతులకు చెందిన జంతువులు. కానీ ఉమ్మడిగా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఉమ్మడిగా ముందడుగు వేశాయి. ప్రస్తుతం కోతి, శునకం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అవి రెండూ వేరు వేరు జాతులకు చెందిన జంతువులు. కానీ ఉమ్మడిగా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఉమ్మడిగా ముందడుగు వేశాయి. ప్రస్తుతం కోతి, శునకం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. సరేగానీ.. కోతి, శునకం రెండూ ఒకే లక్ష్యం కోసం పని చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి.



వీధిపై ఉన్న ఓ దుకాణం వద్ద శునకం నిల్చుని ఉండగా.. అక్కడకు ఓ కోతి కూడా వచ్చింది. అనంతరం శునకం వీపుపైకి ఎక్కిన కోతి.. షాపులోని చిప్స్ ప్యాకెట్‌లను దొంగిలించిందేకు ప్రయత్నిచింది. మొదటి ప్రయత్నంలో చిప్స్ ప్యాకెట్ కోతి చేతికి అందినా.. అది దాన్ని సొంతం చేసుకోలేకపోయింది. దీంతో కోతి మరోసారి ప్రయత్నించింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. రెండూ కలసి ముందే ప్లాన్ చేసుకున్నట్టు కుక్క.. కోతికి సహకరించింది. అది తన వీపుపైకి ఎక్కినా శునకం మాత్రం కోతితో ఘర్షణకు దిగలేదు. ఈ దృశ్యాలను స్థానికులు కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. 




Updated Date - 2022-05-22T19:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising