ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుందంటారు? దీనిలో నిజమెంతో తెలుసా?

ABN, First Publish Date - 2022-02-08T17:54:19+05:30

పలు దేశాల్లోని ప్రజలకు రాత్రిపూట పడుకునే ముందు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు దేశాల్లోని ప్రజలకు రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం అలవాటు. అయితే ఇలా ఎందుకు చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి వేర్వేరు కారణాలు వినిపిస్తుంటాయి. గోరు వెచ్చని పాలు తాగడం వలన మంచి నిద్ర వస్తుందని కొందరంటుండగా, పొట్టను శుభ్రంగా ఉంచుతుందని మరికొందరు చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి కేసులు పెరుగున్న నేపధ్యంలో వేడి పాలు.. నిద్ర మధ్య ఎటువంటి సంబంధం ఉందో  ఇప్పుడు తెలుసుకుందాం. బీబీసీకి చెందిన సైన్స్ ఫోకస్ అనే మ్యాగజైన్ తెలిపిన వివరాల ప్రకారం వేడి పాలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వేడిపాలలో ఒక ప్రత్యేక రకం ప్రోటీన్ ఉంటుంది. దీనిని ఆల్ఫా-లాక్టాల్బుమిన్ అని పిలుస్తారు.




ఇది అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ మూలం. ఇది శరీరంలోనికి చేరుకున్నాక సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ న్యూరోట్రాన్స్మిటర్ మనిషి మానసిక స్థితిని, నిద్రను నియంత్రిస్తుంది. శరీరంలోకి ఆల్ఫా-లాక్టాల్‌బుమిన్‌కు చేరుకున్న తర్వాత రక్తంలో అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు దాని ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. ఫలితంగా మనిషి నిద్ర మునుపటి కంటే మెరుగ్గా మారుతుంది. ఇంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడానికి ఉపయుక్తమయ్యే మూలకాలు (కేసిన్) కూడా ఈ పాలలో కనిపిస్తాయి. ఫలితంగా మనిషి మానసికంగా రిలాక్స్‌ అవుతాడు. వేడి పాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి నెదర్లాండ్స్‌లోని 15 మంది మహిళలపై పరిశోధన జరిగింది. వీరు నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు. పాలు తాగిన తర్వాత వారి నిద్ర మెరుగుపడుతుందని పరిశోధనలో వెల్లడైంది. పాలలో మెగ్నీషియం, ప్రొటీన్ కెసైన్ హైడ్రోలైజేట్ తగినంతగా ఉన్నప్పుడు నిద్ర మెరుగుపడుతుందని రిపోర్టు చెబుతోంది. కాగా పాలు మన శరీర బరువు పెరగకుండా కూడా పనిచేస్తాయని హెల్త్‌లైన్ రిపోర్టు చెబుతోంది.1800 మంది మహిళలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాలు తాగే మహిళల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గిందని వెల్లడయ్యింది.

Updated Date - 2022-02-08T17:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising