ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపరేషన్ చేసి మహిళ కాలేయం నుంచి సూది తొలగించిన వైద్యులు.. ఆ సూది లోపలికి ఎలా వెళ్లిందంటే..

ABN, First Publish Date - 2022-03-17T17:34:12+05:30

ఆ మహిళకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.. స్కానింగ్ తీసిన వైద్యులు కాలేయంలో సూది ఇరుక్కున్నట్టు గుర్తించారు.. ఆపరేషన్ చేసి ఆ సూదిని బయటకు తీశారు.. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం సురక్షితంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


జైపూర్‌కు సమీపంలోని గంగానగర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ ఇంట్లో తన జాకెట్టు కుట్టుకుంటూ సూదిని తన పళ్ల మధ్యలో పెట్టుకుంది. ఊపిరి తీసుకునే సమయంలో అనుకోకుండా ఒక్కసారిగా సూదిని మింగేసింది. రెండ్రోజులు పట్టించుకోలేదు. అయితే కడుపులో నొప్పి మొదలు కావడంతో స్థానిక వైద్యుడిని కలిసింది. వారు జైపూర్‌లోని హాస్పిటల్‌కు పంపించారు. అక్కడ స్కానింగ్ నిర్వహించిన డాక్టర్లు కాలేయంలో సూది ఇరుక్కున్నట్టు గుర్తించారు. 


రెండ్రోజుల తర్వాత మరోసారి స్కానింగ్ నిర్వహించగా సూది అక్కడే ఉండిపోయినట్టు కనబడింది. దీంతో వైద్యులు టెలిస్కోపిక్ ఆపరేషన్ చేశారు. రెండు గంటలపాటు అతి జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఆ సూదిని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం సురక్షితంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.  

Updated Date - 2022-03-17T17:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising