ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: డాక్టర్‌పై మర్డర్ కేసు.. ఆపరేషన్ థియేటర్‌లో అతను చేసిన పనికి అందరూ షాక్!

ABN, First Publish Date - 2022-07-31T22:25:47+05:30

ఆ 22 ఏళ్ల యువతికి కాలు వాపు రావడంతో హాస్పిటల్‌కు వెళ్లింది.. పరీక్షించిన వైద్యుడు (Doctor cut patient's vein) కాలిలో చిన్న గడ్డ ఉందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ 22 ఏళ్ల యువతికి కాలు వాపు రావడంతో హాస్పిటల్‌కు వెళ్లింది.. పరీక్షించిన వైద్యుడు (Doctor cut patient's vein) కాలిలో చిన్న గడ్డ ఉందని, ఆపరేషన్ చేసి దానిని తొలగించాలని చెప్పాడు.. ఆ యువతి సర్జరీ చేసుకునేందుకు అంగీకరించింది.. అయితే డాక్టర్ ఆపరేషన్ సమయంలో కాలులోని గడ్డకు బదులు రక్త నాళాన్ని కట్ చేసేశాడు.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువతి హాస్పిటల్‌లోనే మరణించింది.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ డాక్టర్‌పై మర్డర్ కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌ (Rajasthan) లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Crime: అశ్లీల వీడియోలతో బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.. రూ.2 లక్షలు డిమాండ్.. చివరకు..


జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల నికిత అనే యువతి కాలు వాపు రావడంతో ఏప్రిల్ 26న వివా హాస్పిటల్‌కు వెళ్లింది. పరీక్షించిన మనోజ్ అనే వైద్యుడు కాలులో ఓ చిన్న గడ్డ ఉందని, సర్జరీ చేసి దానిని తొలగించాలని చెప్పాడు. సీనియర్ సర్జన్ నేతృత్వంలో ఆ ఆపరేషన్ జరుగుతుందని చెప్పాడు. దాంతో నికిత ఆపరేషన్‌కు సిద్ధమైంది. అయితే ఆ సర్జన్ లేకుండానే మనోజ్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యాడు. ఆపరేషన్ సమయంలో నికిత కాలులోని గడ్డకు బదులు రక్త నాళాన్ని కట్ చేశాడు. దీంతో నికిత కాలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. డాక్టర్లు వెంటనే ఐదు యూనిట్ల రక్తం, నాలుగు యూనిట్ల ప్లాస్మా ఎక్కించారు. 


సాయంత్రానికి నికిత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్‌ అమర్చారు. చివరకు నికిత హాస్పిటల్‌లోనే మరణించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించి డాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు సదరు వైద్యుడిపై మర్డర్ కేసు నమోదు చేసి విచారించాలని పోలీసులను ఆదేశించింది.  

Updated Date - 2022-07-31T22:25:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising