ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరుకు పెళ్లి కారు.. లోపల ఆడవాళ్లను ఎక్కించి.. వారు చేసిన పని తెలిస్తే అవాక్కవుతారు

ABN, First Publish Date - 2022-01-27T22:04:53+05:30

అది ఓ పెళ్లి కారు.. కారు అద్దం ముందు వధూవరుల పేర్లతో స్టిక్కర్ అంటించి ఉంది. లోపల కొందరు మగవాళ్లతో పాటూ కొందరు మహిళలు కూడా ఉన్నారు. అంతా సందడి సందడిగా ఉన్నారు. ఇందులో ఏం విశేషం ఏముందీ.. ఇదంతా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది ఓ పెళ్లి కారు.. కారు అద్దం ముందు వధూవరుల పేర్లతో స్టిక్కర్ అంటించి ఉంది. లోపల కొందరు మగవాళ్లతో పాటూ కొందరు మహిళలు కూడా ఉన్నారు. అంతా సందడి సందడిగా ఉన్నారు. ఇందులో ఏం విశేషం ఏముందీ.. ఇదంతా మామూలే కదా అని అనుకుంటున్నారా! పోలీసులు కూడా మొదట అలాగే అనుకున్నారు. అయితే అనుమానం వచ్చి కారును ఆపి ప్రశ్నించగా.. ‘‘ సార్, పెళ్లికి వెళ్తున్నాం.. ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా వెళ్లాలి సార్’’ అంటూ మహా నటుల్ని తలపించేలా యాక్ట్ చేశారు. అయితే వారు అసలే పోలీసులు కాబట్టి.. ఎక్కడో అనుమానం కలిగి అందరినీ దిగమన్నారు. లోపల తనిఖీ చేసి చూసి అవాక్కయ్యారు..


అది ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ప్రాంతం. జనవరి 24న స్థానిక పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ బొలేరో వాహనం అటుగా వచ్చింది. కారు ముందు వైపు అద్దం మీద.. పెళ్లికి సంబంధించిన స్టిక్కర్ అంటించి ఉంది. ఎక్కడా ఎలాంటి అనుమానం కలగకుండా పక్కా ప్లానింగ్‌గా ఏర్పాట్లు చేసుకున్నారు. లోపల కొందరు ఆడవాళ్లు కూడా ఉన్నారు. వాహనాన్ని ఆపిన పోలీసులు వారిని ప్రశ్నించగా.. ‘‘పెళ్లివారం సార్.. ముహూర్తానికి సమయం దగ్గరపడింది.. త్వరగా వెళ్లాలి’’ .. అని బదులిచ్చారు. అయితే వారి మాటలు తేడాగా ఉండడంతో పోలీసులకు అనుమానం కలిగింది. అందరినీ దిగమని చెప్పి కారును తనిఖీ చేశారు. సీటు కింద భాగంలో గంజాయి ప్యాకెట్లు ఉండడం చూసి షాక్ అయ్యారు.

పెళ్లయిన నాలుగు నెలలకే భార్యకు పెద్ద పెద్ద కోరికలు.. వాటిని తీర్చలేక ఆ భర్త తీసుకున్న నిర్ణయం..


మొత్తం 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే నలుగురిని అదుపులోకి తీసుకోగా.. అరెస్టయిన వారిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నిందితులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన సహదేవ్ గిరి (23), సుభాష్ చంద్ర నాయక్ (46), ఒడిశాకు చెందిన ఆర్బీ సోని (26), రూబీ సోని (22)గా గుర్తించారు. వీరు గంజాయిని ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తెలిసింది. ఈ గంజాయి సుమారు రూ.3 లక్షల విలువ చేస్తుందని పోలీసులు తెలిపారు. కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పెళ్లికి వెళ్తున్నట్లు నటిస్తూ గతంలో కూడా పలుమార్లు గంజాయిని తరలించినట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అస్వస్థత కారణంగానే కొడుకు చనిపోయాడనుకున్నారు.. ఓ రోజు కోడలు ఫోన్‌లో మాట్లాడుతుండగా అనుమానం రావడంతో..

Updated Date - 2022-01-27T22:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising