ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పైలట్‌గా మారిన రెండేళ్ల బాలుడు.. అసలు ఇది ఎలా సాధ్యమైందంటే..

ABN, First Publish Date - 2022-02-27T23:35:33+05:30

విమాన ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. విండో సీటు పక్కనే కూర్చుని అద్దంలో నుంచి ఆకాశంలోకి చూస్తూ వెళ్తుంటే ఆ థ్రిల్లే వేరు. అందులోనూ పైలట్లు ఉండే కాక్ పిట్‌లో కూర్చుని ప్రయాణం చేస్తే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విమాన ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. విండో సీటు పక్కనే కూర్చుని అద్దంలో నుంచి ఆకాశంలోకి చూస్తూ వెళ్తుంటే ఆ థ్రిల్లే వేరు. అందులోనూ పైలట్లు ఉండే కాక్‌పిట్‌లో కూర్చుని ప్రయాణం చేస్తే ఇక ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అయితే ఈ అవకాశం ఒక్క పైలట్లకు తప్ప వేరే వారికి ఉండదు. ఓ రెండేళ్ల బాలుడికి కూడా ఇదే కోరిక పుట్టింది. ఎలాగైనా పైలట్ సీట్‌లో కూర్చోవాలని కలలు కనేవాడు. చివరికి అతడి కల ఇలా నెరవేరింది.


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. విమానం కాక్‌పిట్‌లోని పైలట్ సీట్లో కూర్చోవాలనేది.. రెండేళ్ల బాలుడి చిరకాల కోరిక. ఈ విషయం విమానాశ్రయ అధికారుల వరకు వెళ్లింది. స్పందించిన అధికారులు.. బాలుడి కోరిక తీర్చేందుకు ముందుకొచ్చారు. విమానంలోకి అడుగుపెట్టిన బాలుడికి సాదరంగా స్వాగతం పలికి.. కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లారు. పిల్లాడిని ఓ పైలట్ తన పక్కన ఉన్న సీట్‌లో కూర్చోబెట్టాడు. లోపలికి వెళ్లీ వెళ్లగానే వావ్.. అంటూ బుడ్డోడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు. పైలట్ సీట్ లో కూర్చోగానే మరింత ఆనందంతో అంతా తేరిపారా చూస్తాడు. తర్వాత బాలుడి తలపై పైలట్ టోపీని పెడతాడు. పైలట్ కోరికను తీర్చుకున్న బాలుడు.. ఆనందంతో ఫొటోకు ఫోజు ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కంప్లయింట్ ఇవ్వడానికి వస్తే.. ఏకంగా కాపురమే పెట్టేశాడు.. ఈ కానిస్టేబుల్ చేసిన పని చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..





Updated Date - 2022-02-27T23:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising