ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: పురుషుడు తన భార్య, పిల్లల ముందు అస్సలు చేయకూడని పనులివే..

ABN, First Publish Date - 2022-01-17T12:00:16+05:30

చాణక్య నీతి మనుషుల జీవితాలను మంచి మార్గంలోకి మళ్లిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాణక్య నీతి మనుషుల జీవితాలను మంచి మార్గంలోకి మళ్లిస్తుంది. ఆచార్య చాణక్య ఈ గ్రంథం ద్వారా మనిషి తన జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు పలు సూచనలు చేశారు. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మన మాటలు ఇతరులను నొప్పించేలా ఉండకూడదు. ముఖ్యంగా కుటుంబ యజమాని అయిన పురుషుడు, తన భార్యాపిల్లల ముందు తప్పుడు మాటలు మాట్లాడకూడదు. అనాలోచితంగా ప్రవర్తించకూడదు. ఇటువంటి ప్రవర్తన అతని గౌరవాన్ని దెబ్బతీస్తుంది. కుటుంబ యజమాని ప్రవర్తన గురించి ఆచార్య చాణక్య ఏమి చెప్పారో ఇప్పుడు చూద్దాం. 


అనైతిక భాష

తల్లిదండ్రుల మాటలు, భాష తీరు అలవాట్లకు పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతారని చాణక్య నీతి చెబుతోంది. తమ ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ యజమాని పిల్లల ముందు అనైతిక భాష వాడకూడదు. ఇది పిల్లలపై అమితమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. వారి భావి జీవితాన్నిదెబ్బతీస్తుంది. 

తెలివితక్కువ పనులు

పురుషుడు భార్య ఎదుట కొన్ని పనులు చేయకూడదని, అలా చేస్తే ఆమె బాధపడుతుందని చాణక్య నీతి చెబుతోంది. భర్త కటువుగా మాట్లాడడం, కొట్టడం వల్ల భార్యలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని, ఇది మంచిది కాదని చాణక్య తెలిపారు. ఇలా చేయడం వల్ల భర్తపై ఆమెకు గౌరవం తగ్గుతుంది. జీవితంలో తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు విజయం దూరమవుతుంది. అందుకే పురుషులు తమ ప్రవర్తనపై శ్రద్ధ చూపాలని ఆచార్య చాణక్య తెలిపారు. 

అహంకారం

కుటుంబ యజమాని తన ఇంటి వాతావరణం చక్కగా ఉండేలా చూసుకోవాలి. చాణక్య నీతి ప్రకారం కుటుంబసభ్యులంతా ఇంటిలోని వాతావరణాన్ని మెరుగ్గా ఉంచడానికి కృషి చేయాలి. ఇంట్లోని వాతావరణం మెరుగ్గా ఉంటే సానుకూల శక్తి నిలిచివుంటుంది. కుటుంబ యజమాని క్రమశిక్షణ పాటించాలి. కోపానికి, అహంకారానికి దూరంగా ఉంటూ తన స్వభావంలో వినయం, భాషలో మాధుర్యాన్ని కలిగివుండాలి. అప్పుడే కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉండగలరని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-01-17T12:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising