ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఇటువంటి వారికి సహాయం చేస్తే ఇబ్బందుల్లో పడతారు!

ABN, First Publish Date - 2022-04-20T13:14:37+05:30

ఆచార్య చాణక్యుడు తన విధానాల ద్వారా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్యుడు తన విధానాల ద్వారా మన జీవితానికి సంబంధించిన పలు సమస్యలకు పరిష్కారాన్ని చూపాడు. చాణక్య నీతిలో ఆచార్య కౌటిల్య... కొంతమందికి సహాయం చేయకూడదని, అలా చేస్తే మనం ఇబ్బందుల్లో పడతామని హెచ్చరించారు. ఆచార్య చాణక్య తన అనుభవాలు, విషయపరి జ్ఞానం ఆధారంగా మూడు తరహాల వ్యక్తులను గుర్తించారు. వారు చాణక్య దృష్టిలో సహాయానికి అర్హులు కాదు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. వ్యసనపరులు

మాదకద్రవ్యాల బానిసలైనవారికి సహాయం చేయకూడదని ఆచార్య చాణక్య తెలిపారు.  మాదకద్రవ్యాల బారిన పడినవారికి విశ్వాసం ఉండదని చాణక్య నమ్ముతాడు. వారు డ్రగ్స్ కోసం ఎవరికైనా హాని చేయవచ్చు. అంతే కాదు మత్తులో ఉన్న వ్యక్తి తప్పు,ఒప్పులను గుర్తించలేడు. అందుకే అలాంటి వ్యసనపరులకు ఎప్పుడూ సహాయం చేయకూడదు. వారికి సేవ చేయడం లేదా డబ్బు ఇవ్వడం హాని చేస్తుందని హెచ్చరించాడు. 

2. చెడు స్వభావం గల వ్యక్తి

చెడు స్వభావం కలిగిన వారిని మీరు గుర్తిస్తే వారికి దూరంగా ఉండటం  మంచిది. అవగాహనతో అటువంటివారిని గుర్తించండి. అలాంటి వారికి మనం మంచి చేసినా, సహాయం చేసినా మనకే నష్టం కలుగుతుందని చాణక్య తెలిపారు. అలాంటి వారితో పరిచయం కలిగినవారికి సమాజం నుంచి, కుటుంబం నుంచి అవమానాలు ఎదురవుతాయి. అందుకే అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలి.

3. విచారంలో మునిగే వ్యక్తి

జీవితంలో దేనికీ తృప్తి చెందని, ఎప్పుడూ సంతోషంగా ఉండని వారికి దూరంగా ఉండాలని చాణక్య తెలిపాడు. ఇలాంటివారికి మేలు చేస్తే మనం బాధపడవలసి వస్తుంది. అలాంటి వారి జీవితం ఎంత బాగున్నా.. వారు ఎప్పుడూ అసంతృప్తితో ఉంటారు. ఇలాంటివారు ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడుతుంటారు. ఈ విధంగా అకారణంగా అసూయపడే వారికి, అసంతృప్తితో మెలిగేవారికి దూరంగా ఉండం మంచిదని ఆచార్య చాణక్య సూచించారు. 

Updated Date - 2022-04-20T13:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising