ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనిషిని కుట్టాక తేనెటీగలు నిజంగా చనిపోతాయా?

ABN, First Publish Date - 2022-05-29T16:47:32+05:30

మనిషిని కుట్టిన అనంతరం తేనెటీగలు చనిపోతాయని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషిని కుట్టిన అనంతరం తేనెటీగలు చనిపోతాయని చాలామంది చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల రకాల తేనెటీగలు ఉన్నాయని, వాటిలో కొన్ని మనుషులను కుట్టవని వాటిపై చేప్టటిన పరిశోధనలలో తేలింది. రెండు దశాబ్దాలుగా తేనెటీగలపై పరిశోధనలు చేస్తున్న వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ నికోలస్ నేగర్ ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ జాతుల తేనెటీగలు ఉన్నాయని, అవి మానవులను కుట్టవని చెప్పారు. 


ఈ తేనెటీగల సమూహాన్ని 'స్టింగ్‌లెస్ బీస్' అంటే కుట్టని తేనెటీగలు అంటారు. మనిషిని కుట్టిన తర్వాత తేనెటీగలు చనిపోతాయా? అనే ప్రశ్నకు పెన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి అలిసన్ రే మాట్లాడుతూ కొన్ని తేనెటీగలు మనిషిని కుట్టిన తర్వాత చనిపోతాయన్నారు. నిజానికి తేనెటీగలు మనుషులను.  కీటకాలను కుడతాయి. కీటకాల చర్మం మానవుల చర్మం కంటే చాలా సన్నగా ఉంటుంది, అందుకే వాటిని కుట్టినప్పుడు తేనెటీగలకు ఎటువంటి హాని కలుగదు. అయితే తేనెటీగ మనిషిని కుట్టి ఎగిరిపోయినప్పుడు స్టింగ్ దాని శరీరం నుండి వేరయిపోతుంది. ఈ స్థితిలో అది అది కొన్ని గంటలు మాత్రమే జీవిస్తుందన్నారు. మనిషిని కుట్టిన తేనెటీగ మరుసటి రోజు ఉదయం వరకు జీవించలేదని అలిసన్ కనుగొన్నారు. అయితే కొన్ని తేనెటీగలకు ఈ సూత్రం వర్తించదన్నారు.

Updated Date - 2022-05-29T16:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising