ఛాలెంజ్ ఓటు- టెండర్ ఓటు అంటే ఏమిటో తెలుసా? వీటి మధ్య తేడా ఏమిటో.. ఇవి ఎందుకు ఉన్నాయో తెలిస్తే..
ABN, First Publish Date - 2022-02-20T17:50:21+05:30
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఛాలెంజ్- టెండర్ ఓటు అంటే ఏమిటి? వీటిని ఓటర్లు ఈ ఓట్లను ఎలా ఉపయోగించుకోవాలి? ఈ రెండింటి మధ్యగల తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఛాలెంజ్ ఓటు అంటే ఏమిటి?
ఓటింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ స్టేషన్‌లో ఛాలెంజ్ ఓటుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఛాలెంజ్ ఓటు అనేది ఓటు వేయడానికి కాదు.. అక్రమ ఓటర్లు అడ్డుకోవడానికి.. అవును.. ఓటింగ్ జరుగుతున్న సమయంలో ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఎన్నికల ఏజెంట్లు కూడా పోలింగ్ కేంద్రంలో కూర్చుంటారు. ఈ ఏజెంట్లు ఓటరును గుర్తించే పని చేస్తుంటారు. పార్టీలు లేదా అభ్యర్థులు తమ తరపున వారిని పోలింగ్ స్టేషన్‌లో నియమిస్తాయి. ఎన్నికల ఏజెంట్లు ఈ ఛాలెంజ్ ఓటును ఉపయోగించుకుంటారు. ఈ ఛాలెంజ్ ఓటు కోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఓటరు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వచ్చినప్పుడు, అతను నకిలీ ఓకర్ అని ఏజెంట్ అనుమానించినప్పుడు ఛాలెంజ్ ఓటు ఉపయోగపడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, పోలింగ్ ఏజెంట్ ప్రిసైడింగ్ అధికారి ముందు ఛాలెంజ్ ఓటు వేస్తాడు. తగిన రుసుము కూడా చెల్లిస్తాడు. అప్పుడు ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ అధికారికి అతను సరైన ఓటరు కాదని తెలియజేస్తాడు. దీంతో ప్రిసైడింగ్ అధికారి ఓటరు దగ్గరున్న పత్రాలను తనిఖీ చేసి, అవి సరిగా ఉంటే ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తారు. ఎన్నికల ఏజెంట్ చెప్పినది నిజమని స్పష్టమైతే ఓటరును ఓటు వేయకుండా అడ్డుకుంటారు.
టెండర్ ఓటు అంటే ఏమిటి?
తమ ఓటు గల్లంతయ్యిదని ఫిర్యాదు చేసే వ్యక్తుల కోసం ఎన్నికల సంఘం 'టెండర్ ఓటు' ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఓటరు ఓటు వేయవచ్చు. ఎన్నికల సంఘం నిబంధనలలోని సెక్షన్ 42 ప్రకారం 'టెండర్డ్ ఓటు' ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రిసైడింగ్ అధికారులకు ముందస్తుగా ప్రత్యేక మార్గదర్శకాలు అందజేస్తారు. దీంతో పాటు ఓటింగ్ సమయంలో వచ్చిన కిట్‌లో టెండర్ ఓట్లను కూడా ఇస్తారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు కమిషన్‌కు ఈ వివరాలను కూడా తెలియజేయాల్సివుంటుంది. ఉదాహరణకు, మీరు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు.. అప్పటికే మీ ఓటు ఎవరో వేశారని మీకు తెలిసిందని అనుకుందాం. అటువంటి పరిస్థితిలో మీరు ఈ విషయమై ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు, అ అధికారి మీరు చెప్పిన దానిని పరిశీలించి, మీ గుర్తింపును ధృవీకరిస్తారు. దీని తర్వాత మీరు టెండర్ ఓటును డిమాండ్ చేయవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితిలో మీరు EVM ద్వారా ఓటు వేయలేరు. బ్యాలెట్ సాయంతోనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.
Updated Date - 2022-02-20T17:50:21+05:30 IST