ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 నుంచి అమర్‌నాథ్ యాత్ర... పులకింపజేసే ప్రత్యేకతలివే!

ABN, First Publish Date - 2022-06-23T16:59:05+05:30

ఈ నెల(జూన్) 30 నుండి భక్తులు అమర్‌నాథ్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెల(జూన్) 30 నుండి భక్తులు అమర్‌నాథ్‌ను దర్శించుకోనున్నారు.  ఈ గుహలోనే శివుడు... పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 11 (రక్షా బంధన్) వరకు కొనసాగుతుంది. బాబా అమర్‌నాథ్ గుహ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. గుహ లోపల, మంచుతో నిండిన నీటి బిందువులు నిరంతరంగా కారుతూ ఉంటాయి. ఈ చుక్కల ఆధారంగా దాదాపు 10-12 అడుగుల ఎత్తులో మంచు శివలింగం ఏర్పడుతుంది. అమర్‌నాథ్ శివలింగం ఎత్తు పెరగడం, తగ్గడం అనేది చంద్రునితో ముడిపడివుంటుంది. పౌర్ణమి నాడు, శివలింగం పూర్తి పరిమాణంలో ఉంటుంది. అమావాస్య రోజున శివలింగం పరిమాణం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అమర్‌నాథ్ గుహ శ్రీనగర్‌కు దాదాపు 145 కి.మీ. దూరంలో ఉంది. ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో హిమాలయాల మీద ఉంది. శివలింగం సహజంగా గుహలో ఏర్పడింది. శివలింగంతో పాటు గణేశుడు, పార్వతి, భైరవ్ మహారాజ్ విగ్రహాలు కనిపిస్తాయి. అమర్‌నాథ్ యాత్ర రెండు మార్గాల్లో సాగుతుంది. ఒక మార్గం పహల్గామ్ మీదుగా, మరొక మార్గం సోన్‌మార్గ్ బల్తాల్ మీదుగా సాగుతుంది. 


ఈ ప్రయాణం కోసం ముందుగా పహల్గాం లేదా బల్తాల్ చేరుకోవాలి. దీని తర్వాత వాకింగ్ టూర్ ఉంటుంది. పహల్గాం నుండి అమర్‌నాథ్‌కి దూరం దాదాపు 28 కి.మీ. అయితే ఈ మార్గం కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది. బల్తాల్ నుండి అమర్‌నాథ్‌కు దాదాపు 14 కి.మీ దూరం ఉంటుంది, అయితే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండే మార్గం. అమర్‌నాథ్ గుహకు సంబంధించిన కథనం ప్రకారం పార్వతీ దేవి శివుని నుండి అమరత్వ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంది. పరమశివుడు పార్వతిని అమర కథను చెప్పడానికి తీసుకువెళుతున్నప్పుడు అనంతనాగ్‌లో తన వద్ద నున్న అనంతమైన సర్పాలను విడిచిపెట్టాడు. చందన్‌వాడిలో నుదుటిపై ఉన్న గంధాన్ని తొలగించాడు. మెడలోని శేషనాగును శేష్‌నాగ్ అనే ప్రదేశంలో వదిలేశారు. ఈ ప్రదేశాలన్నీ ఇప్పటికీ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే మార్గంలో కనిపిస్తాయి. అమర్‌నాథ్ గుహలోనే శివుడు అమ్మవారికి అమరత్వ రహస్యాన్ని తెలిపాడు. ఈ రహస్యాన్ని ఒక పావురం కూడా విన్నదని చెబుతారు. ఈ గుహను మొదటగా ఒక గొర్రెల కాపరి చూశాడంటారు. గుహ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. 



Updated Date - 2022-06-23T16:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising