ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతను పగలు డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేసేవాడు.. రాత్రి మాటువేసి ఒంటరిగా ఉన్నవారిని వేటాడేవాడు.. అలా ఎందుకు చేసేవాడంటే..

ABN, First Publish Date - 2022-02-04T09:46:17+05:30

ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసే యువకుడు.. త్వరగా డబ్బు సంపాదించడం కోసం పెడదారిలో వెళ్లాడు. తన స్నేహితుడితో కలిసి రాత్రివేళ బైక్‌పై వెళ్లేవాడు. ఒంటరిగా రోడ్డుపై తిరుగుతున్న వారిని గమనించి.. వారిపై దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసే యువకుడు.. త్వరగా డబ్బు సంపాదించడం కోసం పెడదారిలో వెళ్లాడు. తన స్నేహితుడితో కలిసి రాత్రివేళ బైక్‌పై వెళ్లేవాడు. ఒంటరిగా రోడ్డుపై తిరుగుతున్న వారిని గమనించి.. వారిపై దాడి చేసేవాడు. ఆ తరువాత ఆ వ్యక్తి వద్ద ఉన్న మొబైల్, డబ్బులు, నగలు కాజేసేవాడు. ఇలాంటి దొంగతనాలు ఎక్కువ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరానికి చెందిన సందీప్ కుమార్(23) అనే యువకుడు ఢిల్లీ సమీపంలోని గుర్‌గావ్ ప్రాంతంలో ఫుడ్ డెలివరి బాయ్‌గా పనిచేసేవాడు. ఆ ప్రాంతంలో సంపన్నులు ఎక్కువ. దీంతో సందీప్ అక్కడ నివసించే వారిని బాగా గమనించేవాడు. లాక్‌డౌన్ సమయంలో అతని డెలివరి బాయ్ ఉద్యోగం కూడా పోవడంతో సందీప్‌కు డబ్బులు అవసరమయ్యాయి. ఆ సమయంలో సందీప్ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతనికి మరో వ్యక్తి సహాయం కావాల్సి వచ్చింది. 


సందీప్ స్నేహితుడు నితిన్(25) రాజస్థాన్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నితిన్‌తో కలిసి గుర్గావ్‌లో దొంగతనాలు చేద్దామని సందీప్ ప్లాన్ వేశాడు. అందుకోసం నితిన్‌ను ఒప్పించడానికి రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ అతనితో కొన్ని రోజులు ఫ్యాక్టరీలో పనిచేశాడు. దొంగతనాలు ఎలా చేయాలో నితిన్‌కు వివరించాడు. బాగా డబ్బు వస్తుందని ఆశపడి నితిన్ కూడా అందుకు ఒప్పుకున్నాడు.


అలా ఇద్దరూ కలిసి గుర్గావ్ వచ్చారు. అక్కడ సీసీటీవి లేని వీధులను బాగా గమనించారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఎవరైనా ఆ వీధులలో ఒంటరిగా వెళుతున్నప్పుడు వారిపై దాడి చేసి వారి వద్ద నుంచి మొబైల్, డబ్బు, నగలు దోచుకునేవారు. దోపిడి చేశాక వెంటనే ఉత్తర్ ప్రదేశ్ పారిపోయి ఆ మొబైల్ ఫోన్లు తక్కువ రేటుకి అమ్మేసేవారు. ఇలా ఈ మధ్య రెండు నెలల వ్యవధిలో దాదాపు 15 దొంగతనాలు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. ఈ ఇద్దరి గురించి పోలీసులకు సమాచారం అందడంతో చాలా చాకచక్యంగా పట్టుకున్నారు.


నితిన్, సందీప్ వద్ద నుంచి పోలీసులు 15 మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ దొంగతనం కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.


Updated Date - 2022-02-04T09:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising