ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం తల్లివమ్మా.. హోం వర్క్ చేయలేదని 5 ఏళ్ల కూతురి కాళ్లు చేతులు కట్టేసి డాబాపై మండుటెండలో..

ABN, First Publish Date - 2022-06-09T21:12:45+05:30

ఐదేళ్ల చిన్నారితో కన్నతల్లి అత్యంత కర్కశంగా వ్యవహరించింది. హోంవర్క్ చేయలేదని అమానుషంగా ప్రవర్తించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదేళ్ల చిన్నారితో కన్నతల్లి అత్యంత కర్కశంగా వ్యవహరించింది. హోంవర్క్ చేయలేదని అమానుషంగా ప్రవర్తించింది. తన ఐదేళ్ల కూతురి కాళ్లూ, చేతులు కట్టేసి మిట్ట మధ్యాహ్నం మండుటెండలో డాబా మీద పడుక్కోబెట్టింది. ఎండ వేడికి తాళలేక ఆ చిన్నారి విలవిలాడిపోయింది. ఈ అమానవీయమైన ఉదంతం గత వారం ఢిల్లీలో జరిగింది. ఆ ఘటనకు సంబందించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


ఇది కూడా చదవండి..

మొత్తానికి అనుకున్నది సాధించిన యువతి.. తనను తానే పెళ్లి చేసుకుని హనీమూన్‌కు కూడా..


మండుటెండకు తాళలేక చిన్నారి ఏడవడం చూసిన వారిందరినీ కదిలించింది. కన్నకూతురితోనే అంతటి ఘోరంగా ప్రవర్తించిన అలాంటి కఠినాత్మురాలిని శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ వీడియో వైరల్ అయి పోలీసుల వరకు వెళ్లడంతో వారు కూడా స్పందించారు. విచారణ జరిపి ఆ ఘటన ఖజూరీ ఖాస్‌ ప్రాంతంలో జూన్‌ 2న జరిగినట్టు తెలుసుకున్నారు. బాధిత చిన్నారి హోంవర్క్‌ చేయలేదని కన్నతల్లే కఠినశిక్ష విధించిందని, పొరుగింటిలో ఉండే ఓ మహిళ వీడియో తీసిందని పోలీసులు తెలిపారు.


చిన్నారి మాదిరిగానే ఆమె తల్లి కాళ్లుచేతులు కూడా కట్టేసి మండుటెండలో వదిలేయాలని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కాగా, చిన్నారి తల్లిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. స్కూల్ హోంవర్క్ చేయడం లేదని కేవలం 5 నిమిషాల వరకూ తానే కూతురిని ఎండలో వదిలేసినట్టు ఆ మహిళ అంగీకరించిందని చెప్పారు. 

Updated Date - 2022-06-09T21:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising