ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: అమ్మ బాబోయ్.. ఇతడు 5 నిమిషాల్లో 3 కేజీల భారీ సమోసాను తినేసి ఆ తర్వాత..

ABN, First Publish Date - 2022-09-04T22:50:20+05:30

అతడు బ్లాగర్.. ఛాలెంజ్‌లలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు అందరికి షాకిచ్చాడు. కేవలం ఐదంటే.. ఐదు నిమిషాల్లో ఏకంగా మూడు కేజీల భారీ సమోసాను ఖతం చేసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడు బ్లాగర్.. ఛాలెంజ్‌లలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు అందరికి షాకిచ్చాడు. కేవలం ఐదంటే.. ఐదు నిమిషాల్లో ఏకంగా మూడు కేజీల భారీ సమోసాను ఖతం చేసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెటింట వైరల్(Viral) అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఢిల్లీ(Delhi)లోని రెస్టారెంట్ యజమానులు ఫుడ్ ఛాలెంజ్‌ల పేరిట కస్టమర్లను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్ యజమాని మూడు కేజీల బరువు గల భారీ సమోసాను నిర్ణీత సమయంలో తినాలని కస్టమర్లకు సవాల్ విసిరాడు. ఈ పోటీలో గెలిస్తే.. రూ.11వేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే రజనీష్ జ్ఞాని(Rajneesh Gyani)  అనే బ్లాగర్, యూట్యూబర్.. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. కేవలం ఐదు నిమిషాల్లో 3 కేజీల సమోసాను తినేసి(Blogger Eats 3 Kg Ka Samosa) రూ.11వేలు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈ గెలుపొందిన మొత్తాన్ని తన యూట్యూబ్ ఛానల్‌లో మరిన్ని వీడియోలు చేయడానికి ఖర్చు చేస్తానని చెప్పాడు. ఇదిలా ఉంటే.. రజనీష్ జ్ఞాని కొద్ది రోజుల క్రితమే.. ఇటువంటి ఫుడ్ ఛాలెంజ్‌లోనే పాల్గొని బుల్లెట్ బండి గెలుచుకున్నాడు. కేవలం అరగంటలో 21 ప్లేట్ల చోలే కుల్చా తినేసి‌ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే తర్వాత తాను గెలుపొందిన ఆ బైక్‌ను తిరిగి రెస్టారెంట్‌కు ఇచ్చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. 


Updated Date - 2022-09-04T22:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising