ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: జింకను తినేయాలని దూసుకొచ్చిన పులి.. అయినా కొంచెం కూడా భయంలేని జింక.. చివరకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-03-16T02:17:28+05:30

మామూలుగా పులిని చూడగానే జింకలు బెదిరిపోయి.. పారిపోవడం చూస్తుంటాం. అయితే ఈ జింకకు మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. జింకను తినేయాలనే ఆశతో ఓ పులి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో పులి, జింకకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూస్తుంటాం. జింకలను అమాంతం నోట కరుచుకుపోయే పులుల వీడియోలు కొన్నయితే.. పులి దాడి నుంచి అనూహ్యంగా తప్పించుకుని బయపడే జింకలకు సంబంధించిన వీడియోలు కొన్ని ఉంటాయి. అయితే ఇప్పడు మీరు చూడబోయే వీడియో.. వీటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మామూలుగా పులిని చూడగానే జింకలు బెదిరిపోయి.. పారిపోవడం చూస్తుంటాం. అయితే ఈ జింకకు మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. జింకను తినేయాలనే ఆశతో ఓ పులి వేగంగా దూసుకొస్తుంది. అయితే జింకలో మాత్రం కాస్త కూడా భయం కనిపించదు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఓ పార్కులో జింక గడ్డి మేస్తూ ఉంటుంది. పక్కనే ఓ చిరుత పులి మాటు వేసి ఉంటుంది. మెల్లగా సమీపానికి వచ్చి.. ఒక్కసారిగా జింకపై దూకేస్తుంది. అయితే జింక మాత్రం చాలా కూల్‌గా ఉంటుంది. పులిని చూసి పరుగెత్తే మాట అటుంచితే.. ఎంతో ఆత్మవిశ్వాసంతో తన పనిలో తాను నిమగ్నమై ఉంటుంది. అయితే జింకకు, పులికి మధ్యలో ఇనుప కంచె ఉండడంతో జింక్ సేఫ్ అయింది. కంచె ఉన్నా, లేకున్నా.. పులిని చూడగానే పరుగులు పెట్టాల్సిన జింక.. తాపీగా గడ్డి మేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. జింక వద్దకు వచ్చి గాండ్రించినా జింకలో మాత్రం ఇసుమంత కూడా బెరుకు కనిపించదు. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న సందర్శకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘జింక ఆత్మవిశ్వాసం చూస్తుంటే.. ఆశ్చర్యం వేస్తోంది’’.. అని కొందరు, ‘‘ ప్రతి ఒక్కరిలో జింకకు ఉన్న ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉండాలి’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.

ముందున్న ప్రమాదం నుంచి బయటపడాలనుకున్న అడవి పంది.. అంతలోనే వెనుక నుంచి..





Updated Date - 2022-03-16T02:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising