ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటింగ్ యాప్‌లో అమ్మాయిలకు వల.. వాళ్లని బెదిరించి ఏకంగా కోటి రూపాయల దోపిడీ.. చివరకు..

ABN, First Publish Date - 2022-03-09T05:44:26+05:30

అతను ఎమ్‌బీఏ చదివాడు. తన తెలివితేటలను మంచి మార్గంలో కాకుండా సైబర్ క్రైమ్ కోసం వినియోగించాడు. పలు డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్‌తో అకౌంట్లు ఓపెన్ చేసి అమ్మాయిలతో స్నేహం చేశాడు. వారి ఫోన్ నెంబర్లు, పర్సనల్ ఫొటోలు సంపాదించి బ్లాక్‌మెయిలింగ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఎమ్‌బీఏ చదివాడు. తన తెలివితేటలను మంచి మార్గంలో కాకుండా సైబర్ క్రైమ్ కోసం వినియోగించాడు. పలు డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్‌తో అకౌంట్లు ఓపెన్ చేసి అమ్మాయిలతో స్నేహం చేశాడు. వారి ఫోన్ నెంబర్లు, పర్సనల్ ఫొటోలు సంపాదించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. అలా ఏకంగా రూ. కోటి సంపాదించాడు. అతడి కోసం ఎన్నో నెలలుగా అన్వేషిస్తున్న పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.. 


ఘజియాబాద్‌కు చెందిన నిందితుడు వైభవ్ ఎమ్‌బీఏ పూర్తి చేశాడు. పలు డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్‌తో అకౌంట్లు తెరిచాడు. తాను ఒక ఐటీ ఇంజినీర్‌గా పరిచయం చేసుకుని పలువురు అమ్మాయిలతో స్నేహం చేశాడు. వారి పర్సనల్ ఫోన్ నెంబర్లు తీసుకుని వారికి క్లోజ్ అయ్యేవాడు. ఆ క్రమంలో వారి ప్రైవేట్ ఫొటోలు సేకరించేవాడు. అనంతరం వాటితో బెదిరింపులకు దిగి డబ్బులు గుంజేవాడు. 


ఇలా యూపీ, పంజాబ్‌, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు చెందిన యువతులను బెదిరించి కోటి రూపాయలకు పైనే సంపాదించాడు. మోసపోయిన యువతులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదు చేసుకున్న ఘజియాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వైభవ్ కోసం అన్వేషణ సాగించి ఎట్టకేలకు పట్టుకున్నారు. విచారణలో అతని అసలు పేరు ఆనంద్ పాల్ అని తేలింది. నిందితుడి మొబైల్‌లో 500 మంది అమ్మాయిల ఫొటోలున్నాయి. 

Updated Date - 2022-03-09T05:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising