ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యబాబోయ్.. కౌగిలింతల వైద్యం.. ఆమెకు కాసుల వర్షం కురిపిస్తోంది..!

ABN, First Publish Date - 2022-11-13T12:46:12+05:30

మగవారు తమ భావోద్వేగాలను బయటపెట్టలేరని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ మహిళ తాను ఇతరులను కౌగిలించుకున్నందుకు గంటకు అక్షరాలా 12,000 రుపాయలు వసూలు చేస్తుంది. వింతగా అనిపించినా ఇదే నిజం.ఆ పని చేస్తూ ఆమె ఎంతో సులభంగా లక్షల రుపాయలను సంపాదిస్తోంది. ఇంతకూ ఈమె ఎవరు?? అంత సంపాదన ఎలా సాధ్యం వంటి వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియాకు చెందిన మిస్సీ రాబిన్సన్ అనే మహిళ మానసిక ఆరోగ్య కార్యకర్త, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తనవంతు సహాయం చేయాలని అనుకున్నారు. ఆ ఆలోచనతోనే ఈమె కడెల్ థెరపీ ప్రారంబించారు. శంకర్ దాదా సినిమాలో హాస్పిటల్ తుడిచే తాతకు చిరంజీవి ఆత్మీయంగా ఓ కౌగిలి ఇచ్చేసరికి ఆ తాత తాను చేస్తున్న పనిలో కష్టం, విసుగు, చిరాకు వంటి పనులన్నీ మరచిపోయి సంతోషంగా పనిచేయగలుగుతాడు. అలాగే ఎన్నో సందర్భాలలో మనుషులు బాధలో ఉన్నప్పుడు ఓదార్పుగా కౌగిలించుకుంటే మానసికంగా వారికి చెప్పలేనంత ఊరట లభిస్తుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఈ విషయం నిరూపించబడింది కూడా. ఇలా.. కౌగిలి అనేది గొప్ప ఔషదంలాగా పనిచేస్తుందన్నమాట. దానితో ఇప్పుడు లక్షల కొద్ది డబ్బు సంపాదిస్తోంది మిస్సీ రాబిన్సన్.

సాధారణంగా ఆడవారు తమ భావోద్వేగాలను బయటపెట్టినట్టు మగవారు బయటపెట్టలేరు. కారణం ఏదైనా మానసికంగా డిస్ట్రబ్ అయినపుడు మగవారు కాసింత ఓదార్పు కోరుకుంటారు. అలాంటి వాళ్శకు మిస్సీ మంచి ఆప్షన్ గా మారింది. గంట నుండి వారికి నచ్చినంత సమయం వారిని కౌగిలించుకుని సమయానికి తగిన మొత్తాన్ని వారి నుండి తీసుకుంటుందామె. మానసికంగా ఇబ్బంది పడుతున్నవారికి సహాయం చెయ్యడమే తన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

ఇదేదో బాగుందని అనుకున్నారో ఏమో కస్టమర్ లు కూడా ఆమెను బాగానే అప్రోచ్ అవుతున్నారట. ఈమెను అప్రోచ్ అయిన ఒక క్లైంట్ ను ఓ రాత్రి మొత్తం కౌగిలించుకున్నందుకు ఈమె 1.5లక్షల రుపాయలు తీసుకుందట. దీని వల్ల వారి మానసిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయని 43సంవత్సరాల మిస్సీ చెబుతున్నారు. అంతేకాదండోయ్ ఇలాంటి ఊరట అందరికీ లభించకపోవడం వల్లనే కొంతమంది ఉన్మాదులుగా, మరికొంతమంది సైకో కిల్లర్ లు గా మారుతున్నారని కూడా ఆమె చెప్పారు. క్లైంట్ లు ఈమెను బయట కొందరు కలిస్తే, మరికొందరు నేరుగా ఇంటికి ఆహ్వానిస్తున్నారట. ఇది కూడా ఓ రకమైన థెరపీ అని చెబుతున్న మిస్సీ ఆస్ట్రేలియా మానసిక ఆరోగ్యసంస్థకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. కోసమెరుపు ఏమిటంటే.. మిస్సీ ని సంప్రదిస్తున్న క్లైంట్ లలో 20 నుండి 50 సంవత్సరాల వయసు వారే ఉన్నారట. ఏది ఏమైనా ఈ కొత్త తరహా వైద్యానికి మంచి డిమాండ్ ఉన్నట్టుంది.

Updated Date - 2022-11-14T09:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising