ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధులు శుభ్రం చేయడానికి రంగంలోకి దిగిన కాకులు.. ప్రభుత్వానికి 75శాతం ఖర్చు ఆదా

ABN, First Publish Date - 2022-02-04T02:30:09+05:30

వీధులను శుభ్రం చేయడానికి స్వీడన్‌లో కాకులు రంగంలోకి దిగాయి. ప్రజలు తాగిపడేసిన సిగరేట్లు డబ్బాల్లో వేస్తూ ఆహారాన్ని సంపాదించుకోవడమే కాకుండా అక్కడి ప్రభుత్వానికి కూడా బోలెడంత ఖర్చు తగ్గిస్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వీధులను శుభ్రం చేయడానికి స్వీడన్‌లో కాకులు రంగంలోకి దిగాయి. ప్రజలు తాగిపడేసిన సిగరేట్లు డబ్బాల్లో వేస్తూ ఆహారాన్ని సంపాదించుకోవడమే కాకుండా అక్కడి ప్రభుత్వానికి కూడా బోలెడంత ఖర్చు తగ్గిస్తున్నాయి. ‘వీధులను కాకులు శుభ్రం చేయడం ఏంటి? అవి అలా చేయడం ద్వారా వాటికి ఆహారం దొరకడం ఏంటి.. పైగా ప్రభుత్వానికి ఖర్చులు తగ్గడం ఏంటి?’ అని ఆశ్చర్యపోతున్నారా? నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇది నిజం. 



సోడెర్టాల్జె మున్సిపాలిటీ ప్రజలు ఎడాపెడా సిగరెట్లను తాగుతూ.. సిగరెట్ పీకలను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారట. ఇది అక్కడి ప్రభుత్వానికి సవాలుగా మారిందట. రోడ్లను శుభ్రం చేయడానికి సుమారు రూ.16.28కోట్లు ఖర్చు చేస్తోంది. దీంతో నగరంలోని స్వీడన్ టైడీ ఫౌండేషన్.. కీలక నిర్ణయం తీసుకుంది. ‘కోర్విడ్ క్లీనింగ్’ అనే పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోకి వందలాది కాకులను దింపింది. రోడ్లపై ఉన్న సిగరెట్ పీకలను ఈ కాకులు నోటితో పట్టుకెళ్లి, పక్కనే ఉన్న డబ్బాలో వేస్తున్నాయి. ఫలితంగా అవి ఆహారాన్ని పొందుతున్నాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ కాకుల వల్ల ప్రభుత్వానికి 75శాతం ఖర్చు తగ్గిందని వెల్లడించారు. కోర్విడ్‌ జాతికి చెందిన న్యూ కెలడోనియా కాకులు చాలా తెలివైనవని ఓ పరిశోధనలో తేలడంతో.. వాటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. చెత్తను కాకులు డబ్బాలో వేయగానే అందులోంచి ఆహారం వచ్చే విధంగా చెత్త బుట్టను డిజైన్ చేసినట్టు వెల్లడించారు.  



Updated Date - 2022-02-04T02:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising