ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పావురాల పేరుతో కోట్ల ఆస్తి.. అదెలా సాధ్యమంటే?..

ABN, First Publish Date - 2022-01-11T06:03:09+05:30

సాధారణంగా కోట్ల ఆస్తి పొందాలంటే.. ఒకటి ఎంతో శ్రమపడి.. ఏళ్ల తరబడి కష్టపడాలి లేదా అదృష్ట దేవత వరించాలి. ఈ విషయాలు మనుషులకు వర్తిస్తాయి. కానీ రాజస్థాన్‌లోని జస్‌నగర్ పట్టణంలో పావురాలకు కోట్ల విలువ చేసే ఆస్తి ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా కోట్ల ఆస్తి పొందాలంటే.. ఒకటి ఎంతో శ్రమపడి.. ఏళ్ల తరబడి కష్టపడాలి లేదా అదృష్ట దేవత వరించాలి. ఈ విషయాలు మనుషులకు వర్తిస్తాయి. కానీ రాజస్థాన్‌లోని జస్‌నగర్ పట్టణంలో పావురాలకు కోట్ల విలువ చేసే ఆస్తి ఉంది. అక్కడ వీటిని కోటీశ్వర పావురాలని కూడా అంటారు. 


జస్‌నగర్‌లో పావురాల పేరిట 27 షాపులు, కొన్ని కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న 78 ఎకరాల భూమి, రూ. 30 లక్షల విలువ గల నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఇంత ఆస్తి ఈ శాంతి దూతల పేరిట ఎలా వచ్చిదంటే..


నలభై ఏళ్ల క్రితం జస్‌నగర్ పట్టణంలో కబుతరన్ ట్రస్ట్ (కబుతరన్ అంటే పావురాలు) ఏర్పాటైంది. పారిశ్రామిక వేత్త సజ్జన్ రాజ్ జైన్ ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆయన పావురాల కోసం స్థాపించిన ఈ ట్రస్ట్ వల్ల కొన్ని వేల పావురాలకు రోజూ మంచి మేత, వాటి ఆరోగ్య సంరక్షణ అందుతోంది. అంతేకాదు ఈ ట్రస్ట్ పేరిట ఉన్న భూమిలో 10 ఎకరాలలో  అనాథ గోవులకోసం గోశాలలు కూడా నిర్మించారు. ఇందులో ప్రస్తుతం 500 ఆవులు ఉన్నాయి.

Updated Date - 2022-01-11T06:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising