ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crocodile : కాలనీలోకి 8 అడుగుల మొసలి.. షాకింగ్ వీడియో ఇదీ.. ఎలా వచ్చిందో..

ABN, First Publish Date - 2022-08-14T22:54:11+05:30

మనుషుల నివాసప్రాంతంలోకి ఒక మొసలి(Crocodile) ప్రవేశించిత ఘటన మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని శివపురి(Shivapuri) జిల్లాలో వెలుగుచూసింది. భారీ వర్షాల వరదల్లో 8 అడుగుల పొడవున్న మొసలి ఒకటి శివపురిలోని ఓ కాలనీలోకి వచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివపురి, మధ్యప్రదేశ్ : మనుషుల నివాసప్రాంతంలోకి ఒక మొసలి(Crocodile) ప్రవేశించిత ఘటన మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని శివపురి(Shivapuri) జిల్లాలో వెలుగుచూసింది. భారీ వర్షాల వరదల్లో 8 అడుగుల పొడవున్న మొసలి ఒకటి శివపురిలోని ఓ కాలనీలోకి వచ్చింది. కాలనీలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ ఇంటి ముందు నీటిలో ఉన్న మొసలిని గుర్తించిన స్థానికులు అధికారులకు తెలియజేశారు. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే స్పందించామని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్(ఎస్‌డీవోపీ) అజయ్ భార్గవ చెప్పారు.


దాదాపు గంట ఆపరేషన్ తర్వాత ఈ మొసలిని మాధవ్ నేషనల్ పార్క్ రెస్క్యూ టీం పట్టుకుందని తెలిపారు. ఈ మొసలిని సంఖ్యా సాగర్ లేక్‌లో విడిచి పెట్టామని అధికారులు వివరించారు. భారీ వర్షాలతో కాలనీలోని కాలువ ఉప్పొంగడంతో మొసలి వచ్చివుంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి భారీ వర్షం కురిసిందని చెప్పారు. వరదల నేపథ్యంలో అధికారులకు ముందుస్తు సమాచారం ఇచ్చామని, హెడ్‌క్వార్టర్లను వీడొద్దని చెప్పామని అన్నారు.



Updated Date - 2022-08-14T22:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising