ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

`నా గాళ్‌ఫ్రెండ్ వెయిట్ చేస్తోంది`, `కుక్క నా లైసెన్స్ తినేసింది`.. Traffic Violationsపై పోలీసుల ప్రశ్నలకు నెటిజన్ల ఫన్నీ సమాధానాలు!

ABN, First Publish Date - 2022-07-09T20:51:53+05:30

ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా పాటిస్తే సురక్షితంగా గమ్యం చేరుతామని తెలుసు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా పాటిస్తే సురక్షితంగా గమ్యం చేరుతామని తెలుసు. హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాల నుంచి బయటపడొచ్చని తెలుసు. అయినా చాలా మంది ట్రాఫిక్ రూల్స్‌ను పాటించరు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలీసులకు దొరికిపోతే ఏవేవో సాకులు చెబుతారు. తాజాగా Delhi Police డిపార్ట్‌మెంట్ ట్విటర్ ద్వారా ఇలాంటి సాకుల గురించి నెటిజన్లను అడిగింది. `నిబంధనలను ఉల్లంఘించి దొరికిపోయిన తర్వాత మీరు ట్రాఫిక్ పోలీసులకు చెప్పిన అత్యంత చమత్కారమైన సాకులు ఏంటి?` అని ఢిల్లీ పోలీసులు అడిగారు. 



ఇది కూడా చదవండి..

Viral Video: నడిరోడ్డుపై వరద నీటిలో జలకాలాటలు.. ఫన్నీ వీడియోపై నెటిజన్ల సెటైర్లు..


ఈ ప్రశ్నకు నెటిజన్లు ఫన్సీ ఆన్సర్లు చెప్పి నవ్వులు పూయించారు. ఒక వ్యక్తి.. `నా గర్ల్‌ఫ్రెండ్ వెయిట్ చేస్తోంది. త్వరగా వెళ్లకపోతే బ్రేకప్ చెప్పేస్తుంద`ని ట్రాఫిక్ పోలీస్‌లకి చెప్పాడట. ఆ వ్యక్తి అలా చెప్పినప్పుడల్లా పోలీసులు వదిలేశారట. అలాగే కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా దొరికిపోయిన ఓ మహిళ తాను గర్భవతినని అబద్ధం చెప్పి తప్పించుకుందట. ఒక వ్యక్తి అయితే ఏకంగా తన భార్య క్యారెక్టర్‌నే బ్యాడ్ చేసి పోలీసుల నుంచి తప్పించుకున్నాడట. `సర్, నా భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఆమె ఇప్పుడు తన ప్రేమికుడితో సరసాలు ఆడుతోంది. వెంటనే వెళ్లి పట్టుకోవాల`ని చెప్పాడట. 


ఇంకొక వ్యక్తి `సార్, ఇది మొదటి సారి, మళ్లీ ఇలా జరగద`ని చెబితే పోలీసులు వదిలేశారట. మరో వ్యక్తి తాను స్టూడెంట్‌నని, డబ్బులు లేవని చెప్పాడట. అలాగే తన తల్లికి అనారోగ్యంగా ఉందని, వెంటనే మందులు పట్టుకుని వెళ్లాలని చెప్పి మరొక వ్యక్తి తప్పించుకున్నాడట. ఇక, లైసెన్స్ లేకుండా పట్టుబడిన వ్యక్తి.. `తన లైసెన్స్‌ను కుక్క తినేసింద`ని చెప్పాడట.  మొత్తానికి ఢిల్లీ పోలసుల ప్రశ్నకు నెటిజన్లు చెబుతున్న సమాధానాలు నవ్వులు కురిపిస్తున్నాయి. 

Updated Date - 2022-07-09T20:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising