ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Food Order చేస్తే.. వచ్చిన ప్యాకెట్ చూసి షాకైన కస్టమర్..

ABN, First Publish Date - 2022-08-17T19:44:24+05:30

బాగా ఆకలేస్తోంది.. తినడానికి ఏమీ లేవు.. అప్పుడేం చేస్తాం? వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా. ఓహియో(Ohio)కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగా ఆకలేస్తోంది.. తినడానికి ఏమీ లేవు.. అప్పుడేం చేస్తాం? వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా. ఓహియో(Ohio)కు చెందిన ఓ వ్యక్తి సైతం అదే పని చేశాడు. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కూడా వచ్చేసింది. ఇక ఎందుకు ఆలస్యమని తినేందుకు ఉపక్రమించాడు. కానీ ఆ ఫుడ్‌తో పాటు వచ్చిన ఓ ప్యాకెట్ చూసి షాక్ అయ్యాడు. డెలివరీ బ్యాగ్(Delivery Bag) అడుగున గంజాయి(marijuana) ప్యాకెట్ ఉంది. బ్యాక్ కింద ఒక ఫోర్క్ దాని పక్కన ఒక హ్యాష్‌ ప్యాకెట్‌ను గుర్తించాడు.


ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆగస్ట్ 9న జరిగింది. "నేను మొదట భయపడ్డాను. కానీ పెద్దగా ఆశ్చర్యపోలేదు’’ అని సదరు వ్యక్తి ఓ ఆంగ్ల మీడియాకు తెలిపాడు. డెలివరీ బాయ్(Delivery Boy) కాసేపటికి తిరిగి వచ్చి గంజాయి కావాలని కోరాడని.. అయితే అది గంజాయి అని చెప్పలేదని.. తన స్నేహితుడికి మందు అని చెప్పాడని కస్టమర్ తెలిపాడు. అయితే తన పేరు చెప్పడానికి మాత్రం కస్టమర్ ఇష్టపడలేదు.


అయితే డెలివరీ బాయ్‌కు ఆ ప్యాకెట్‌ని తిరిగి ఇవ్వలేదని.. పోలీసులతో పాటు ఫుడ్ డెలివరీ సంస్థ డోర్‌డాష్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. అసలు ఈ వ్యవహారం డెలివరీ బాయ్‌తో ప్రారంభమైందా? లేదంటే తాను ఆర్డర్ చేసిన రెస్టారెంట్‌ నుంచి ప్రారంభమైందా? అనేది అర్థం కాలేదని కస్టమర్ వెల్లడించాడు. తన ఆప్త మిత్రుడుతో పాటు అతని మేనల్లుడు గంజాయి తాగి మరణించాడని వెల్లడించాడు.


తానొక హెల్త్‌ కేర్ వర్కర్‌ని అని.. గంజాయి ప్రజలను ఎలా ప్రజలను ప్రభావితం చేస్తుంటుందో రోజూ చూస్తుంటానని సదరు కస్టమర్ వెల్లడించాడు. ప్రస్తుతం సదరు కస్టమర్ మరోసారి ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ను మళ్లీ చేయాలంటే ఒకరకంగా భయపడుతుండటం గమనార్హం. కాగా.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, డెలివరీ చేసిన ఫుడ్ బ్యాగ్‌లో డ్రగ్స్ ఉన్నట్లు తాము తెలుసుకున్నట్టు కొలంబస్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ సంస్థ డోర్‌డాష్ ఒక ఈ మెయిల్‌లో కస్టమర్ ఫిర్యాదుపై స్పందించారు. సదరు డెలివరీ బాయ్‌ని సంస్థ నుంచి తొలగించామని.. ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. 


Updated Date - 2022-08-17T19:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising