ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిన్ని కూతురితో ప్రేమ.. పెళ్లికి కుటుంబ సభ్యుల అభ్యంతరం.. దీంతో వారు ఎలాంటి పని చేశారంటే..

ABN, First Publish Date - 2022-04-14T08:29:16+05:30

వారిద్దరూ కజిన్స్.. వరుసకు అన్నాచెల్లెళ్లు.. అయితే ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు.. ఆ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు.. తమ పెళ్లి జరిగే అవకాశం లేకపోవడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ కజిన్స్.. వరుసకు అన్నాచెల్లెళ్లు.. అయితే ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు.. ఆ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు.. తమ పెళ్లి జరిగే అవకాశం లేకపోవడంతో ఆ ఇద్దరూ చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. బీహార్‌లోని బంకా జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


బంకాలోని కటోరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బదాసన్ గ్రామానికి చెందిన, వరుసకు అన్నాచెల్లెళ్లు అయిన యువతీయువకులు ప్రేమలో పడ్డారు. ఆరు నెలల క్రితం వీరి ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు ఇద్దరినీ మందలించారు. యువకుడిని అతడి తల్లిదండ్రులు కోల్‌కతా పంపించారు. చాలా రోజుల తర్వాత గత ఆదివారం ఆ యువకుడు గ్రామానికి తిరిగి వెళ్లాడు. తన ప్రేయసిని కలుసుకున్నాడు. 


ఇద్దరూ అదే రోజు రాత్రి గ్రామానికి సమీపంలో ఉన్న పొలాలకు వెళ్లి మాట్లాడుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఇద్దరూ కలిసి ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. ఉదయం గ్రామస్థులు పొలాల వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతున్న ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-14T08:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising