ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యాభర్తలైనా సరే.. రాత్రి 11 తర్వాత రోడ్లపై తిరగొద్దు.. లేదంటే రూ.1000ఫైన్?

ABN, First Publish Date - 2022-12-11T14:29:19+05:30

భార్యాభర్తలు అయినా అర్ధరాత్రి 11 తర్వాత రోడ్డుపై కలిసి తిరిగితే రూ.1000ఫైన్. షాకింగ్‌గా అనిపించినా.. ఓ వ్యక్తి తానకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాటా టాపిక్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తలు అయినా అర్ధరాత్రి 11 తర్వాత రోడ్డుపై కలిసి తిరిగితే రూ.1000ఫైన్. షాకింగ్‌గా అనిపించినా.. ఓ వ్యక్తి తానకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాటా టాపిక్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరు(Bengaluru)కు చెందిన కార్తీక్ తాజాగా తన భార్యతో కలిసి ఫ్రెండ్‌ ఇంట్లోని ఫంక్షన్‌కు హాజరయ్యాడు. కార్యక్రమం పూర్తయ్యే సరికి రాత్రి 12 దాటింది. ఈ క్రమంలో కార్తీక్ దంపతులు(Couple) తిరిగి తమ ఇంటికి పయనం అయ్యారు. వాళ్ల ఇల్లు దగ్గరే కావడంతో.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆ దంపతులు తమ ఇంటి సమీపం వరకూ వెళ్లిపోయారు. ఇంతలో పెట్రోలింగ్ వాహనంలో అటువైపుగా వచ్చిన పోలీసులు.. వాళ్లను అడ్డుకున్నారు. ఎవరూ? ఏమిటీ? అంటూ వాళ్లపై ప్రశ్నలు కురిపించారు. ఈ క్రమంలో తాము భార్యభర్తలమనీ.. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్లొస్తున్నట్టు సదరు అధికారులకు వెల్లడించారు. అయినా.. పోలీసులు అక్కడితో ఊరుకోలేదు. ఐడీ కార్డులు చూపించాల్సిందిగా కార్తీక్ దంపతులను కోరారు. అనంతరం భార్యభర్తలైనప్పటికీ రాత్రి 11 తర్వాత రోడ్లపై ఇలా తిరగొద్దంటూ ఆ దంపతలుకు రూ.1000ఫైన్(Fined By Police) వేశారు. దీంతో కార్తీక్ దంపతులు షాకయ్యారు.

ఈ నేపథ్యంలోనే కార్తీక్ తనకు ఎదరైన అనుభవాన్ని ట్విట్టర్(Twitter) వేదికగా వెల్లడించాడు. అదికాస్తా డీసీపీ అనూప్ శెట్టి దృష్టికి చేరడంతో.. స్పందించారు. అటువంటి రూల్ ఏమీ లేదని వెల్లడించడంతోపాటు.. సదరు పోలీసు అధికారులను గుర్తించి చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.

Updated Date - 2022-12-11T14:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising