ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: భార్యను తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన పోలీస్.. అనూహ్య ఘటనతో దంపతులు ఇద్దరూ షాక్!

ABN, First Publish Date - 2022-06-19T21:26:43+05:30

ఆయన పోలీసు అధికారి. ఓ విషయంలో డాక్టర్‌ను సంప్రదించడానికి భార్యతో సహా ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి బయల్దేరాడు. తీరా ఆసుపత్రి వద్దకు చేరుకున్న అనంతరం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ దంపతులు ఇద్దరూ ప్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆయన పోలీసు అధికారి. ఓ విషయంలో డాక్టర్‌ను సంప్రదించడానికి భార్యతో సహా ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి బయల్దేరాడు. తీరా ఆసుపత్రి వద్దకు చేరుకున్న అనంతరం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ దంపతులు ఇద్దరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారి.. ఓ విషయంలో వైద్యుడిని సంప్రదించడానికి భార్యతో సహా బైక్‌పై బయల్దేరాడు. ఇంతలో వర్షం మొదలైంది. వానలోనే ఆ భార్యభర్తలు.. ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వర్షం నీటి కారణంగా నిండి ఉన్న ఓపెన్ నాలాను సదరు పోలీసు అధికారు గుర్తించకుండా.. నాలా దగ్గర వరకూ వెళ్లి బండిని పార్క్ చేయబోయాడు. ఇంతలో బండి అదుపు తప్పింది. వరద నీరు ప్రవహిస్తున్న నాలాలో పడిపోయింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు.. ఆ దంపతులను రక్షించారు. 



కాగా.. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను స్థానిక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. ‘అది అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఫెలిసిటీ’ అని కొందరు కామెంట్లు చేస్తే.. ‘ప్రధాన మంత్రి స్విమ్మంగ్‌పూల్ యోజన’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అగ్నిపథ్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.




Updated Date - 2022-06-19T21:26:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising