ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటా రూ.30 లక్షలు సంపాదన.. ప్రభుత్వోద్యోగాలు వచ్చినా వెళ్లకుండా ఈ భార్యాభర్తలు ఏం చేశారంటే... IAS ఆఫీసర్లే వచ్చిమరీ చూసేలాగా..

ABN, First Publish Date - 2022-02-11T23:42:39+05:30

కష్టపడి ఆ భార్యభర్తలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఆధునిక పద్ధతుల ద్వారా కూరగాయలు, పండ్లు పండిస్తూ ఏటా రూ.30ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కష్టపడి ఆ భార్యభర్తలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఆధునిక పద్ధతుల ద్వారా కూరగాయలు, పండ్లు పండిస్తూ ఏటా రూ.30లక్షలు సంపాదిస్తున్నారు. కాగా.. ఆ దంపతులకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్, జైపూర్ జిల్లాలోని కలఖ్ గ్రామానికి చెందిన గంగారామ్ సేపట్, సుమన్ సేపట్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉన్నత చదువులు చదివిని ఈ భార్యభర్తలు.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యారు. తీరా ఉద్యోగాలు వచ్చాక ఆ దంపతులు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని నియంత్రిత వాతావరణంలో జపాన్, ఈజిప్ట్ దేశాల్లో పండే కూరగాయలు, పండ్లు పండించడం మొదలు పెట్టారు. అంతేకాకుండా స్ట్రాబెర్రీలను ఒక్క ఏడాదిలో మూడుసార్లు ఉత్పత్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో తమ పొలంలో పండే పంటను ఎగుమతి చేస్తూ ఏటా 30లక్షలు ఆర్జిస్తున్నారు. 



బయో ఫర్టిలైజర్లు, సహజ ఎరువులనే పంటలకు ఉపయోగిస్తున్నారు. వర్షం నీళ్లు వృథా కాకూడదనే ఉద్దేశంతో పాలీహౌస్‌లపై పడిన ప్రతి వర్షం చుక్కా.. నేరుగా ఫామ్ పాండ్‌లోకి చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అందులో నిలువ ఉన్న నీటిలో ఏకంగా ఏడు రకాల చేపలను పెంచుతూ ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ దంపతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డుల ద్వారా సత్కరించాయి. 


ఈ క్రమంలో సుమన్ సేపట్ మాట్లాడుతూ.. ఏటా లక్షల్లో ఆదాయం వస్తుండటంతో ఉద్యోగాలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. రెండు నెలల క్రితం 18 మంది ఐఏఎస్‌ అధికారుల బృందం తమ పంటపొలాలను సందర్శించినట్టు ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా తాము చేస్తున్న ఆధునిక వ్యవసాయాన్ని ఒక మోడల్‌గా ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు తన భర్త గంగారామ్.. జాబ్నర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతోపాటు మరికొంత మంది ప్రముఖులతో కూడా కలిసి పని చేస్తున్నట్టు సుమన్ వెల్లడించారు.




Updated Date - 2022-02-11T23:42:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising