ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాలిక.. పోలీసు అధికారి కూడా..

ABN, First Publish Date - 2022-05-19T09:14:08+05:30

ఇంటి నుంచి ఎత్తుకెళ్లి ఒక మైనర్ బాలికపై నలుగురు కుర్రాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అమ్మాయిని పోలీస్ స్టేషన్ ముందే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి నుంచి ఎత్తుకెళ్లి ఒక మైనర్ బాలికపై నలుగురు కుర్రాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అమ్మాయిని పోలీస్ స్టేషన్ ముందే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలి చుట్టాలను పిలిచి వాళ్లకు అప్పగించారు. 


అయితే తర్వాతి రోజు స్టేట్‌మెంట్ తీసుకోవాలని పిలిచిన పోలీసు ఉన్నతాధికారి.. ఆ బాలికను స్టేషన్‌కు సమీపంలోని తన క్వార్టర్స్‌కు తీసుకెళ్లి బలాత్కరించాడు. దీనిపై కూడా ఆ బాలిక కేసు పెట్టడంతో ఉన్నతాధికారులు సిట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ ప్రాంతంలో వెలుగు చూసింది. 


స్థానికంగా ఉండే నలుగురు యువకులు ఒక 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, భోపాల్ తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు ఒక హోటల్‌లో ఉంచి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్లిపోయారు. ఆమె మేనత్త వివరాలు తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలిని ఆమెకు అప్పగించారు. మరుసటి రోజు వాంగ్మూలం తీసుకోవడానికి రమ్మని పిలిచి, సాయంత్రం పూట స్టేషన్ సమీపంలోని క్వార్టర్స్‌కు తీసుకెళ్లిన అధికారి అత్యాచారానికి పాల్పడ్డారు. 


ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. ఆయన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై సిట్ ఏర్పాటు చేసిన పోలీసు డిపార్ట్‌మెంట్.. సదరు స్టేషన్‌లోని 29 మంది సిబ్బందిని మార్చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-05-19T09:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising