ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి దారి మధ్యలో లిఫ్ట్ అడిగని యువతి.. ఆమె అందం చూసి మనసు పారేసుకున్న యువకుడు.. కొంతదూరం వెళ్లాక ఆ యువకుడికి పెద్ద షాక్!

ABN, First Publish Date - 2022-04-17T09:18:46+05:30

టీవీల్లో వస్తున్న ఎన్నో క్రైమ్ షోలు దొంగతనాలు కొత్తగా ఎలా చేయాలనే విషయంలో మంచి ఐడియాలు ఇస్తున్నాయి. ఓ హిందీ క్రైమ్ షో చూసిన మహిళల ముఠా వినూత్నంగా చోరీలకు పాల్పడుతోంది. లిఫ్ట్ అడిగి కార్ ఎక్కి, కారులో ఉన్న వారిని తమ అందంతో ఆకట్టుకుని, అతడి వద్ద ఉన్నది దోచుకుంటున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీవీల్లో వస్తున్న ఎన్నో క్రైమ్ షోలు దొంగతనాలు కొత్తగా ఎలా చేయాలనే విషయంలో మంచి ఐడియాలు ఇస్తున్నాయి. ఓ హిందీ క్రైమ్ షో చూసిన మహిళల ముఠా వినూత్నంగా చోరీలకు పాల్పడుతోంది. లిఫ్ట్ అడిగి కార్ ఎక్కి, కారులో ఉన్న వారిని తమ అందంతో ఆకట్టుకుని, అతడి వద్ద ఉన్నది దోచుకుంటున్నారు. భోపాల్‌లో ఇలాంటి చోరీలు ఎక్కువ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. 


భాద్‌భదాకు చెందిన అరుణ్ రాయ్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా ఓ మహిళ లిఫ్ట్‌ అడిగింది. ఆమెకు అరుణ్ లిఫ్ట్ ఇచ్చాడు. కారు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే ఆమె సహచరులు కారు ఆపి దోపిడీకి పాల్పడ్డారు. అరుణ్‌‌ను కిందకు దించి అతడి డబ్బులు, బంగారం, కారు తీసుకుని వెళ్లిపోయారు. దాంతో అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే ఆ ప్రాంతంలో అలాంటి కేసులు పదుల సంఖ్యలో నమోదయ్యాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సమీపంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు వైర్‌లెస్ ద్వారా సమాచారం అందించారు.


సీసీటీవీ సాయంతో నిందిత మహిళను, ఆమె ముఠాను గుర్తించారు. రాతిబాద్ ప్రాంతంలో నిందిత మహిళ,  ఆమె నలుగురు సహచరులను అరెస్టు చేశారు. విచారణలో వారు తమ పాత నేరాలను కూడా అంగీకరించారు. ఓ హిందీ క్రైమ్ షో చూసి ఈ విధానంలో దోపిడీలకు పాల్పడుతున్నట్టు వారు చెప్పవడంతో పోలీసులు షాకయ్యారు. 


Updated Date - 2022-04-17T09:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising