ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indore: జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలయిన ఈ రాజకీయ నేతకు పాలాభిషేకాలు.. ఏం చేసి జైలుకు వెళ్లాడంటే..

ABN, First Publish Date - 2022-08-26T03:42:23+05:30

రాజకీయాల్లో నేర చరిత కలిగిన వాళ్లకు మన దేశంలో కొదవే లేదు. చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లలో చాలామందికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: రాజకీయాల్లో నేర చరిత కలిగిన వాళ్లకు మన దేశంలో కొదవే లేదు. చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లలో చాలామందికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెయిల్‌పై బయటికొచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న రోజులివి. అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వార్త వింతగా అనిపించకపోవచ్చు గానీ భవిష్యత్‌లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయోనన్న ఆందోళనకు గురిచేయడం ఖాయం. ఈ ఫొటోలో పాలాభిషేకంతో తడిసి ముద్దవుతున్న వ్యక్తి పేరు రాజు భండోరియా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కార్పొరేటర్. కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా గెలిచిన ఈ వ్యక్తి జులై 13న అరెస్ట్ కావడం గమనార్హం. ఇండోర్ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంలో తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి చందూరావ్ షిండేను హత్య చేయించేందుకు రాజు భండోరియా జులై 6న యత్నించాడన్న ఆరోపణలతో జులై 13న అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన రాజు భండోరియా బెయిల్‌పై విడుదలయ్యాడు.



అతనికి మద్దతుదారులు ఏ రేంజ్‌లో స్వాగతం పలికారంటే.. పాలాభిషేకాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఇతనికి వెల్‌కమ్ చెప్పారు. హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలయిన వ్యక్తికి పాలాభిషేకం చేయడాన్ని స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి ఉమేష్ శర్మ స్పందిస్తూ.. హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలయిన వ్యక్తికి ఇలాంటి ఆర్భాటాలు చేసి స్వాగతం పలకడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. రాజు భండోరియా జైలులో ఉన్నప్పుడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జులై 13న భండోరియా అరెస్ట్ కాగా.. జులై 17న ఫలితాలు వచ్చాయి. వార్డ్ నెంబర్.22 నుంచి రాజు భండోరియా కార్పొరేటర్‌గా ఎన్నిక కావడం గమనార్హం.

Updated Date - 2022-08-26T03:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising