ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Compensation for Street Dog Bite: కుక్క కాటుకు పది వేలు ఇస్తారు. అదేంటి అనుకుంటున్నారా..

ABN, First Publish Date - 2022-06-07T02:43:23+05:30

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. అనే నానుడి ఉంది. కానీ బెంగళూరులో కుక్క కాటుకు పది వేలు ఇస్తారు. అదేంటి అనుకుంటున్నారా.. అవును నిజమే.. కుక్క కరిస్తే యాంటీ రేబిస్ టీకా వేసుకుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. అనే నానుడి ఉంది. కానీ బెంగళూరులో కుక్క కాటుకు పది వేలు ఇస్తారు. అదేంటి అనుకుంటున్నారా.. అవును నిజమే.. కుక్క కరిస్తే యాంటీ రేబిస్ టీకా వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాక.. బెంగళూరు మహానగర పాలికెలో అప్లై చేసుకుంటే పరిహారం కూడా లభిస్తుంది. వీధి కుక్క కాటుకు గురైన వారికి బీబీఎంపీ పరిహారం ఇస్తుందని చాలా మందికి తెలియదు. దీంతో గత ఏడేళ్లలో 32 వేల మంది కుక్కకాటుకు గురైతే 25 మంది మాత్రమే పరిహారం తీసుకున్నారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలతో గత 8 ఏళ్లుగా వీధి కుక్కల బాధితులకు బీబీఎంపీ పరిహారం ఇస్తోంది. ప్రతీ గాయానికి 2 వేలు, లోతైన గాయమైతే 3 వేలు.. గాయాల సంఖ్య ఎక్కువగా ఉంటే పది వేలు లభిస్తుంది. చికిత్స ఖర్చును సైతం బీబీఎంపీ భరిస్తుంది.



ఒకవేళ కుక్క కరిచి పిల్లలు చనిపోతే 50 వేలు, పెద్దలు చనిపోతే లక్ష రూపాయలు సదరు కుటుంబానికి అందించాలి. 2016లో ఓ వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తికి పరిహారం చికిత్స కింది 70 వేల 430 రూపాయలను అందించారు. ఇప్పటి వరకు కుక్క కాటు బాధితులకు 15 లక్షల రూపాయల వరకు పరిహారం అందించారు. చాలా మందికి ఈ విషయం తెలియకపోవడంతో సొంత ఖర్చుతో చికిత్స చేయించుకుంటున్నారు. ఇకపై కుక్క కరిస్తే.. చికిత్స ఖర్చుతో పాటు పరిహారం కూడా లభిస్తుంది.

Updated Date - 2022-06-07T02:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising