ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుడ్ ప్యాకెట్ల మీద కనిపించే రంగురంగుల సర్కిల్స్‌కి అర్థం ఏమిటో తెలుసా?... అలా ఎందుకు ఉంటాయంటే..

ABN, First Publish Date - 2022-02-28T18:00:38+05:30

మీరు వివిధ రకాల ఆహార ప్యాకేజింగ్ డిజైన్లను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు వివిధ రకాల ఆహార ప్యాకేజింగ్ డిజైన్లను చూసేవుంటారు. అవి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆ ప్యాకేజీ వెనుకవైపు చూసినట్లయితే, ఆ ఆహారానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. బ్రాండ్ సమాచారం, ఆ ఆహారంలోని పోషక విలువలు మొదలైనవి ఉంటాయి. చాలా ఫుడ్ ప్యాకేజీల వెనుక భాగంలో రంగుల సర్కిల్స్, లేదా చతురస్రాకార గుర్తులు కనిపిస్తాయి. అయితే ఈ ఆకారాలు రుచులు, విటమిన్లు లేదా ఖనిజాలకు సంబంధించిన సూచనలు మాత్రం కాదు. 


అవి ప్రింటింగ్ ఇంజనీర్‌ల కోసం రూపొందించినవి. ఆహార ప్యాకేజీలపై పింక్, పసుపు, నీలం, నలుపు, నారింజ, ఊదా లేదా ఆకుపచ్చ సర్కిల్స్ కనిపిస్తాయి. వీటిని ప్రింటర్ కలర్ బ్లాక్‌లు లేదా ప్రాసెస్ కంట్రోల్ ప్యాచ్‌లు అని పిలుస్తారు. ఫుడ్ ప్యాకేజింగ్‌ను ప్రింట్ చేసే ప్రింటింగ్ బృందానికి ఇవి ఉపకరిస్తాయి. వీటి గురించి ప్రింటింగ్ ఇంజనీర్ మెగ్ షిరాల్డి  మాట్లాడుతూ “ప్యాకేజింగ్‌ను ప్రింట్ చేసినప్పుడు, ప్రింటింగ్ ఇంక్, నాణ్యతను తనిఖీ చేయడానికి సాంకేతిక నిపుణులు ఈ రంగుల సర్కిళ్లను ఉపయోగిస్తారని’’ తెలిపారు. చాలా ప్రింటర్లు నాలుగు రంగులను మాత్రమే ఉపయోగిస్తాయి. అవి సియాన్ (నీలం-ఆకుపచ్చ), పసుపు, మెజెంటా,నలుపు. అయితే కొన్ని ప్రింటర్లు ఆరెంజ్, ఆకుపచ్చ, వైలెట్ వంటి మరికొన్ని రంగులను ఉపయోగిస్తాయి. 

Updated Date - 2022-02-28T18:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising