break-up: ప్రియుడు బ్రేకప్ చెప్పేందుకు నిరాకరించాడని ప్రియురాలు ఏం చేసిందంటే...
ABN, First Publish Date - 2022-10-31T11:54:13+05:30
కేరళ(Kerala) రాష్ట్రంలో మరో దారుణమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. తమ ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పలేదనే( refusing to break up) కోపంతో ప్రియుడికి విషం తాగించి హతమార్చిన ప్రియురాలి(girlfriend) బాగోతం సోమవారం బట్టబయలైంది.
తిరువనంతపురం(కేరళ): కేరళ(Kerala) రాష్ట్రంలో మరో దారుణమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. తమ ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పలేదనే( refusing to break up) కోపంతో ప్రియుడికి విషం తాగించి హతమార్చిన ప్రియురాలి(girlfriend) బాగోతం సోమవారం బట్టబయలైంది. తిరువనంతపురం(Thiruvananthapuram) నగరానికి చెందిన గ్రీష్మా, షరోన్ రాజ్ ప్రేయసీ ప్రియులు. గ్రీష్మా, షరోన్ లు ఒక సంవత్సరం పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వారి మధ్య కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో గ్రీష్మా వేరే యువకుడితో వివాహం (wedding) చేసుకోవాలనుకుంది. అయినప్పటికీ ప్రియుడు షరోన్ గ్రీష్మాతో సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో షరాన్ నుంచి విడి పోవటానికి, గ్రీష్మా అతన్ని చంపాలని నిర్ణయించుకుంది.తన జాతకం ప్రకారం మొదటి భర్త చనిపోతాడని చెప్పడం ద్వారా గ్రీష్మా తనను విడిచిపెట్టమని ప్రియుడిని భయపెట్టడానికి ఒక కథను కూడా అల్లింది.అయినా ప్రియుడు బ్రేకప్ చెప్పేందుకు నిరాకరించాడు. దీంతో ప్రియుడు షరోన్ ను హతమార్చాలని ప్రియురాలైన గ్రీష్మా పథకం పన్నింది. ప్రియుడిని తన ఇంటికి పిలిచి ఆయుర్వేద మందులో కపిక్ అనే క్రిమిసంహారక మందును కలిపి తాగించింది. దీంతో షరోన్ వాంతులు చేసుకుంటూ స్నేహితుడితో కలిసి వెళ్లి తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. షరోన్ చికిత్స పొందుతూ 10 రోజుల తర్వాత మరణించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. గ్మీష్మాను 8 గంటల పాటు విచారించిన తర్వాత నేరం ఒప్పుకుంది. తనతో ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పక పోవడంతో తాను విషం తాగించి షరోన్ హతమార్చినట్లు గ్రీష్మా చెప్పింది. దీంతో పోలీసులు గ్రీష్మాను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. బ్రేకప్ చెప్పలేదని ప్రియుడిని హతమార్చిన ప్రియురాలి ఘటన కేరళ రాష్ట్రంలో సంచలనం రేపింది.
Updated Date - 2022-10-31T11:54:14+05:30 IST