ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్బులు, సర్ఫ్ లేనప్పుడు బట్టలు ఎలా ఉతికేవారో తెలుసా? ఖరీదైన దుస్తులను ఎలా మెరిపించేవారంటే..

ABN, First Publish Date - 2022-01-17T17:00:17+05:30

బ్రిటీష్ పాలనలో 130 సంవత్సరాల క్రితం భారతదేశంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటీష్ పాలనలో 130 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆధునిక సబ్బును ప్రవేశపెట్టారు. భారత్‌లో తొలిసారిగా ఇంగ్లండ్‌కు చెందిన లీబర్ బ్రదర్స్ మార్కెట్లోకి ఆధునిక సబ్బును విడుదల చేసింది. దీనికిముందు బ్రిటన్ నుంచి భారత్‌కు సబ్బులు దిగుమతి అయ్యేవి. నార్త్ వెస్ట్ సోప్ కంపెనీ 1897లో మీరట్‌లో మొట్టమొదటి సబ్బుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత టాటా కంపెనీ ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అయితే భారతదేశంలో తొలిసారిగా సబ్బును ఎప్పుడు ఉపయోగించారనే ప్రశ్న వెనుక చాలా చరిత్ర ఉంది. భారతదేశం వృక్షసంపద, ఖనిజాలతో సమృద్ధిగా తులతూగుతుంటుంది. 




పూర్వకాలంలో కుంకుడు చెట్టు కాయలను బట్టలు శుభ్రం చేయడానికి ఉపయోగించేవారు. రాజులు తమ రాజభవనాలలో కుంకుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించేవారు. ఖరీదైన పట్టు వస్త్రాలను శుభ్రం చేయడానికి ఇప్పటికీ కుంకుడుకాయల రసాన్ని వాడుతుంటారు. ఆ రోజుల్లో బట్టలు వేడినీళ్లలో వేసి ఉడకబెట్టేవారు. సామాన్యులు తమ బట్టలను వేడినీళ్లలో వేసి మరిగించేవారు. తర్వాత ఆ దుస్తులను బయటకు తీసి, రాయిపై ఉతికేవారు. నీటిని మరిగించేందుకు పెద్ద కుండలు, పొయ్యిలను ఉపయోగించేవారు. కుంకుడు కాయను.. ఖరీదైన, మృదువైన దుస్తులను ఉతికేందుకు ఉపయోగించేవారు. దుస్తులను శుభ్రం చేయడానికి మరొక మార్గం కూడా ఉంది. ఇది కూడా చాలా ప్రజాదరణ పొందింది. గ్రామీణ ప్రాంతాల్లో నదులు, చెరువుల ఒడ్డున లేదా పొలాల్లో దొరికే తెల్లటి రంగు పొడిని నీళ్లలో వేసి, తరువాత ఆ దుస్తులను ఉతికేవారు. ఇక స్నానం విషయానికొస్తే భారతీయులు శరీరంపై మట్టి, బూడిదను రుద్దుకున్న తర్వాత స్నానం చేసేవారు. పాత్రలను శుభ్రం చేయడానికి బూడిద లేదా మట్టిని ఉపయోగించేవారు. 


Updated Date - 2022-01-17T17:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising