ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి పాత్రలలో వండే ఆహారం ఆరోగ్యకరమని నిపుణులు ఎందుకంటున్నారో తెలుసా?

ABN, First Publish Date - 2022-01-13T13:53:56+05:30

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఆయుర్వేదం, ప్రకృతివైద్యం వైపు మళ్లుతున్నారు. దీనిలో భాగంగానే మట్టికుండల వినియోగం మరింతగా పెరుగుతోంది. దీని గురించి ప్రముఖ ఆయుర్వేద, ప్రకృతివైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ.. నేలలో మన శరీరానికి ప్రత్యక్షంగా మేలు చేసే అంశాలు చాలా ఉన్నాయి. మట్టి కుండలలో ఆహారాన్ని వండటం ద్వారా.. భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరంలోకి చేరుతాయి. ఇటువంటి ప్రయోజనాన్ని అల్యూమినియం పాత్రలు అందించలేవు. మట్టి పాత్రలో తయారుచేసి, దానిలో ఉంచిన ఆహారం ఉదరానికి ఎంతో మేలు చేస్తుంది. 


గ్యాస్, అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం కల్పిస్తుంది. మట్టి కుండలు మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను కొంతమేరకు తగ్గించడంలో సహాయపడతాయి. ఎక్కువ నూనె ఉన్న ఆహారాన్ని మట్టి పాత్రలో ఉంచినప్పుడు అది కొంతవరకు నూనెను పీల్చుకుంటుంది. ఇంతేకాకుండా మట్టి కుండలలో వండిన ఆహారానికి ప్రత్యేక సువాసన, రుచి ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే మట్టి కుండల్లోనే వంట చేయడం మొదలుపెట్టాలని కిరణ్ గుప్తా సూచించారు. మట్టి కుండలో చాలా రకాల సూక్ష్మపోషకాలు కనిపిస్తాయి. ఇవి ఆహారం సహాయంతో నేరుగా శరీరానికి చేరుతాయి. ప్రెషర్ కుక్కర్‌లో తయారు చేసిన ఆహారంలో ఈ మూలకాలు ఉండవు. అయితే మట్టి కుండను ఉపయోగించాలనుకుంటే, దానిని 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. ఆ తరువాత నీళ్లతో బాగా శుభ్రం చేసిన తర్వాతనే వినియోగించాలి. మట్టిపాత్రలను శుభ్రం చేసేందుకు సబ్బును ఎప్పుడూ ఉపయోగించకూడదు. అటువంటి పాత్రలను శుభ్రం చేయడానికి వేడి నీటిని ఉపయోగించాలి. 

Updated Date - 2022-01-13T13:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising