ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chiranjeevi At IFFI: ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా!

ABN, First Publish Date - 2022-11-28T20:52:54+05:30

‘‘ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కంటెంట్‌ మారుతుంది. కొత్త హీరోలు చాలామంది వచ్చారు. ఆ హీరోలు నాకు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. వాళ్లకు ఇప్పుడు కష్టకాలమే’’ అని చిరంజీవి అన్నారు(నవ్వుతూ).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కంటెంట్‌ మారుతుంది. కొత్త హీరోలు చాలామంది వచ్చారు. ఆ హీరోలు నాకు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. వాళ్లకు ఇప్పుడు కష్టకాలమే’’ అని చిరంజీవి (Chiranjeevi)అన్నారు(నవ్వుతూ). గోవా వేదికగా జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ (IFFI)ముగింపు వేడుకలో ఆయన ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ (Indian film persanality of the year)అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...

‘‘నేను ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించా. శివ శంకర్‌ వరప్రసాద్‌ అనే నాకు.. సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. చిత్ర పరిశ్రమలో 45 ఏళ్ల ప్రయాణం నాది. అందులో పదేళ్లు రాజకీయంలో ఉన్నా. అప్పుడే సినిమా విలువ ఏంటో తెలిసింది.. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. చిత్ర పరిశ్రమలో ఉండదు. ఇక్కడ టాలెంట్‌ ఒకటే మంచి స్థాయుకి తీసుకెళ్తుంది. రీ ఎంట్రీ సమయంలో ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని భయపడ్డా. పదేళ్ల తర్వాత కూడా అదే అభిమానాన్ని చూపించారు. నేనీ స్థాయిలో ఉండటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులే కారణం. వారి ప్రేమకు నేను దాసుణ్ని. జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటా. కొనేళ్ల క్రితం ఇదే వేదికపై జరిగిన అవార్డు ఫంక్షన్‌లో దక్షిణాదికి చెందిన ఒక్క హీరో ఫొటో కూడా లేకపోవడం చూసి చాలా బాధపడ్డా. ఇప్పుడు ఇదే వేదికపై నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ఇఫీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇదొక ప్రత్యేకమైన అవార్డు. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా. సరైన సమయంలోనే నాకు ఇచ్చారనుకుంటున్నా. సినిమా ఎక్కడైనా తీయొచ్చు. కానీ, అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాంతీయ భేదాలు తొలగిపోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది’’ అని అన్నారు. 


Updated Date - 2022-11-28T20:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising