ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా మహిళ పన్నాగం.. క్రిఫ్టోకరెన్సీ పేరుతో వల.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తికి రూ.81 లక్షల టోకరా

ABN, First Publish Date - 2022-04-08T08:02:59+05:30

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిఫ్టోకరెన్సీకి మంచి డిమాండ్ ఏర్పడింది.. క్రిఫ్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే బోలెడంత లాభం వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు.. ఆ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యక్తులు అమాయకులను మోసం చేస్తు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిఫ్టోకరెన్సీకి మంచి డిమాండ్ ఏర్పడింది.. క్రిఫ్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే బోలెడంత లాభం వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు.. ఆ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యక్తులు అమాయకులను మోసం చేస్తున్నారు.. తాజాగా చైనాకు చెందిన ఓ మహిళ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తిని నమ్మించి రూ.81 లక్షలు కాజేసింది.. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. 


ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డాక్టర్ అభిషేక్ పాల్‌కు సోషల్ మీడియా ద్వారా హాంకాంగ్‌కు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. 'అన్నా లీ' పేరుతో ఆమె అభిషేక్‌కు పరియయమైంది. క్రిఫ్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే మూడు, నాలుగు రెట్లు రాబడి ఉంటుందని అభిషేక్‌ను అన్నా లీ నమ్మించింది. దీంతో ఆ మహిళను నమ్మిన అభిషేక్ ఆమె చెప్పిన ట్రేడింగ్ యాప్‌లో మొత్తం రూ.81 లక్షలు పెట్టుబడి పెట్టాడు.


కొన్ని రోజుల పాటు ఆ యాప్ ద్వారా అభిషేక్ పెట్టుబడులను ట్రాక్ చేసేవాడు. అయితే ఇటీవల తన పెట్టుబడిని విత్ డ్రా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో అతనికి అనుమానం కలిగింది. తను మోసపోయానని అర్థమైంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2022-04-08T08:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising