ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతడికి 109ఏళ్లు.. ఆమెకు 108ఏళ్లు.. 90ఏళ్లుగా కలిసి నడుస్తున్నారు!

ABN, First Publish Date - 2022-03-14T02:27:27+05:30

అతడికి 109 ఏళ్లు.. ఆమెకు 108 సంవత్సరాలు. వారిద్దరికీ 90ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఏళ్లు గడిచినా వారి మధ్య ప్రేమానురాగాలు ఇసుమంత కూడా తగ్గలేదు. దానికి నిదర్శనం ప్రస్తుతం సోషల్ మీడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 109 ఏళ్లు.. ఆమెకు 108 సంవత్సరాలు. వారిద్దరికీ 90ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఏళ్లు గడిచినా వారి మధ్య ప్రేమానురాగాలు ఇసుమంత కూడా తగ్గలేదు. దానికి నిదర్శనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోనే. ఈ వీడియోను చూసి స్పందిస్తున్న నెటిజన్లు.. వారికి అభినందనలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. చైనాలో అత్యంత వృద్ధదంపతులుగా గుర్తింపు పొందిన ఈ జంటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



109ఏళ్ల వృద్ధుడు, 108ఏళ్ల వృద్ధురాలు.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి 90 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా 90వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ వృద్ధ దంపతులు ఘనంగా జరుపుకొన్నారు. 108ఏళ్ల బామ్మ తెలుపు రంగు దుస్తులు ధరించగా.. ఆయన మాత్రం నలుపు రంగు సూటూ బూటూ వేసుకుని తళుక్కుమన్నాడు. ఇద్దరు కలిసి రకరాల స్టైల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ‘చిన్న చిన్న కారణాలకే పెళ్లి నాటి ప్రమాణాలను తుంగలో తొక్కి.. విడిపోతున్న అనేక మంది భార్యాభర్తలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి’ అని పేర్కొంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






Updated Date - 2022-03-14T02:27:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising