ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఫ్రూట్‌లో కరోనా వైరస్.. దాని అమ్మకాలను నిషేధించిన చైనా

ABN, First Publish Date - 2022-01-07T07:40:20+05:30

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. అయినా దాని మూలాల గురించి పరిశోధకులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కరోనా పేరు వింటేనే భయపడే ప్రజలకు.. మరో ఆందోళన కలిగించే వార్త వచ్చింది. తాజాగా కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని అంశాలు.. డ్రాగన్ ఫ్రూట్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. అయినా దాని మూలాల గురించి పరిశోధకులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కరోనా పేరు వింటేనే భయపడే ప్రజలకు.. మరో ఆందోళన కలిగించే వార్త వచ్చింది. తాజాగా కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని అంశాలు.. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నట్లు తేలింది.  చైనాలోని  జెజియాంగ్ .. జియాంగ్జీ ప్రావిన్సులలోని 9 నగరాల్లో ఈ పండ్లపై జరిపిన పరీక్షలలో వైరస్ కనిపించింది సమాచారం. ప్రపంచంలో కరోనా వైరస్ చైనా నుంచే వ్యాప్తి చెందడం గమనార్హం.


కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వియెత్నాం నుంచి చైనాకు దిగుమతి అయినవి అని తెలిసింది. దీంతో చైనా ప్రభుత్వం ఈ డ్రాగన్ పండ్లను విక్రయించే సూపర్ మార్కెట్లను సీజ్ చేసింది. ఈ పండ్లను కొనుగోలు చేసిన వారిని క్వారంటైన్‌లో ఉంచాలని చైనా అధికారులు ఆదేశించారు. ఇంతకుముందు 2020 డిసెంబర్‌లో కూడా వియత్నాం నుంచి చైనాకు దిగుమతి అయిన డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ కనిపించింది. దీంతో వాటి దిగుమతిని చైనా ప్రభుత్వం 2021 జనవరి 26 వరకు నిషేధించింది. అప్పటి నుంచి చైనా ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాలపై పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది.

Updated Date - 2022-01-07T07:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising