ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: మీ పిల్లలకు బంగారు బాట వేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!

ABN, First Publish Date - 2022-03-17T12:37:19+05:30

చాణక్య నీతి ప్రకారం యోగ్యులైన పిల్లలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాణక్య నీతి ప్రకారం యోగ్యులైన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు అత్యంత అదృష్టవంతులు. అలాంటి వారికి భూమి స్వర్గంగా మారుతుంది. పిల్లలను యోగ్యులుగా మార్చడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. అవసరమైనప్పుడు తల్లిదండ్రులు త్యాగం చేయాలి. పిల్లలు యోగ్యులుగా మారాలంటే తల్లిదండ్రులు వారిపై మరింతగా దృష్టి కేంద్రీకరించాలని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల చదువులు, సంస్కారాలు, భవిష్యత్తు గురించి అవగాహన కల్పించుకుని తల్లిదండ్రులు మెలగాలి. మీరు మీ పిల్లలను యోగ్యులుగా తీర్చి దిద్దాలనుకుంటే చాణక్యుడు తెలిపిన ఈ విషయాలను గుర్తుంచుకోండి.

సంస్కారవంతులుగా తీర్చిదిద్దండి 

చాణక్య విధానం ప్రకారం పిల్లలను తల్లిదండ్రులు సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి. పిల్లలకు మంచి విలువలను నేర్పించే తల్లిదండ్రులకు సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది.


క్రమశిక్షణ ప్రాముఖ్యత తెలియజేయాలి

పిల్లల్లో క్రమశిక్షణ స్ఫూర్తిని పెంపొందించడం చాలా ముఖ్యమని చాణక్య నీతి చెబుతోంది. భవనానికి పునాది బలంగా లేనప్పుడు అది పటిష్టంగా ఉంటుందని అస్సలు చెప్పలేం. అదేవిధంగా పిల్లలకు మొదటి నుంచి మంచి అలవాట్లు నేర్పించకపోతే, ఆ తర్వాత పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమశిక్షణ స్ఫూర్తి అనేది సమయానికున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. విజయంలో సమయం కీలకమైన పాత్ర పోషిస్తుంది. 

విద్య ప్రాముఖ్యతను తెలియజేయండి

పిల్లలకు మంచి విద్యను అందించేందుకు తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలని చాణక్య నీతి చెబుతోంది. పిల్లలకు విద్యను అందించేటప్పుడు అర్హత కలిగిన ఉపాధ్యాయులు. సంస్థల ఎంపిక ఎంతో అవసరం. 

ప్రతిభను ప్రోత్సహించండి

చాణక్య నీతి ప్రకారం ప్రతి చిన్నారికీ ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. తల్లిదండ్రులు వారిలోని ప్రతిభను అర్థం చేసుకుని, తగిన శ్రద్ధ వహిస్తే, వారు విజయం సాధిస్తారు. సంస్కారం, క్రమశిక్షణ మొదలైనవి చిన్నారులలోని ప్రతిభను వెలికితీస్తాయి. 



Updated Date - 2022-03-17T12:37:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising